AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: వచ్చిందండీ వయ్యారి..! సాయం చేస్తానని వచ్చి.. చివరికి ఏం చేసిందంటే..? మీరే చూడండి..

అప్పుడే పక్కనే ఉన్న ఒక అమ్యాయి హెల్ప్ చేస్తానంటూ ముందుకు వస్తుంది. ఆ బంతిని బాస్కెట్ మీద నుంచి కిందకు తీసుకురావడానికి తన కాలికి ఉన్న షూని దానిపైకి విసిరేస్తుంది. అయితే ఆమె బంతి మీదకు కాకుండా చాలా హైట్‌గా తన షూని విసరడం వల్ల..

Trending Video: వచ్చిందండీ వయ్యారి..! సాయం చేస్తానని వచ్చి.. చివరికి ఏం చేసిందంటే..? మీరే చూడండి..
Helping Girl
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 24, 2023 | 9:56 PM

Share

అందరి  చేతుల్లోకి వచ్చిన సోషల్ మీడియా అనేది మాయా ప్రపంచంగా మారిపోయింది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా నెట్టింట క్షణాల్లోనే.. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రత్యక్షమవుతున్నాయి. అయితే ఈ క్రమంలో అనేక వీడియోలు, ఫోటోలు నిత్యం ట్రెండ్ అవుతుంటాయి. అదే తరహాలో తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ అమ్మాయి పక్కనే బంతి పోగొట్టుకుని ఇబ్బంది పడుతున్న అబ్బాయిలకు సాయం చేస్తానని వచ్చి నవ్వుల పాలయింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ అవుతోంది.

crazy__writes160  అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోలో బాస్కెట్‌బాల్ ఆడుకునే ఇద్దరు యువకులు.. తమ బంతి బాస్కెట్ మీద ఇరుక్కుపోవడంతో దానిని తీసే ప్రయత్నంలో ఉంటారు. అయితే అప్పుడే పక్కనే ఉన్న ఒక అమ్యాయి హెల్ప్ చేస్తానంటూ ముందుకు వస్తుంది. ఆ బంతిని బాస్కెట్ మీద నుంచి కిందకు తీసుకురావడానికి తన కాలికి ఉన్న షూని దానిపైకి విసిరేస్తుంది. అయితే ఆమె బంతి మీదకు కాకుండా చాలా హైట్‌గా తన షూని విసరడం వల్ల..అది కాస్త గ్రౌండ్ వెనుక ఉన్న చెట్ల మీద పడి ఇరుక్కుపోతుంది. దీంతో అక్కడే బాస్కెట్ బంతి కోసం ముందు నుంచి ప్రయత్నిస్తున్న ఇద్దరు యువకులు నవ్వుకుంటారు. సాయం చేద్దామని వచ్చినందుకు షూ పోవడంతో ఆమె ఒక్కసారిగా స్టన్ అయి కెమెరా వైపు చూస్తుంది. ఇక దీనికి సంబంధించిన దృశ్యాలను మీరు వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు విపరీతంగా నవ్వేసుకుంటున్నారు. ఇంకా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియో షేర్ అయిన నాటి నుంచి ఇప్పటివరకు 1 లక్షా 55 వేల లైకులు, అలాగే 21 లక్షల వీక్షణలు, 600 వరకు కామెంట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు ఆమెకు ఉన్న కాన్ఫిడెన్సును చూసి ప్రశంసిస్తున్నారు. మరికొందరు ‘నైస్ వీడియో’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..