Wrinkles: 30 ఏళ్లు దాటితే ముఖంపై ముడతలు.. రక్షణ కోసం ఈ చర్యలు..?

|

Jan 30, 2022 | 10:50 AM

Wrinkles: కాలుష్యం, మారిన జీవనశైలి కారణంగా ఆరోగ్యం మాత్రమే కాదు, చర్మం కూడా దెబ్బతింటుంది. ముఖంపై

Wrinkles: 30 ఏళ్లు దాటితే ముఖంపై ముడతలు.. రక్షణ కోసం ఈ చర్యలు..?
Skin
Follow us on

Wrinkles: కాలుష్యం, మారిన జీవనశైలి కారణంగా ఆరోగ్యం మాత్రమే కాదు, చర్మం కూడా
దెబ్బతింటుంది. ముఖంపై మొటిమలు, స్కిన్‌ వదులుగా మారడం జరుగుతున్నాయి. 30 ఏళ్లు
దాటితే చర్మంపై అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వాస్తవానికి ఈ వయస్సులో
చర్మంపై ముడతల సమస్య ప్రారంభమవుతుంది. నిర్జీవమైన చర్మా సమస్యలను ఎదుర్కొంటారు.
సరైన జీవనశైలి, మంచి అలవాట్లని అనుసరిస్తే చర్మాన్ని మునుపటిలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

అయితే బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారం, అందంపై దృష్టి
సారించలేరు. దీని కారణంగా చర్మంపై ముడతలు, ఇతర సమస్యలు ఏర్పడతాయి. ముడతలు ఒక
వ్యక్తిని ముందుగానే ముసలివాడిగా చేస్తాయి. ఈ పరిస్థితిలో కొన్ని ఆహారాలు తీసుకోవడం
ముఖ్యం. వీటిని తీసుకోవడం వల్ల ముడతల సమస్యను చాలా వరకు దూరం చేసుకోవచ్చు.
అవేంటో తెలుసుకుందాం.

1.టమోటా

టమోటా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇది చర్మ సంరక్షణలో ఉత్తమమైనదిగా
చెబుతారు. ఇందులో ఉండే విటమిన్ సి చర్మానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడమే
కాకుండా చర్మంపై రుద్దడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. చర్మంపై ముడతలు రావు.

2. పెరుగు

30 ఏళ్ల వయసులో ముఖంపై ముడతలు రాకూడదంటే పెరుగును మీ ఆహారంలో భాగం
చేసుకోవాలి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా చర్మం ఆకృతిని మెరుగుపరుస్తుంది.
చర్మానికి ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది.

3. చేప

విటమిన్ ఈ చర్మానికి మంచిదని భావిస్తారు. చేపల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది. మీకు నాన్‌వెజ్‌
అంటే ఇష్టం ఉంటే వారానికోసారి చేపలను తప్పకుండా తినండి. వీటిని తినడం ద్వారా ముడతలు,
ముఖంపై మచ్చలు దూరంగా ఉంటాయి.

4. గింజలు

నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా
చాలా ముఖ్యమైనవి. వీటిని సరైన మోతాదులో తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు పడవు.
రెగ్యులర్‌గా తీసుకుంటే అందాన్ని కాపాడుకోవచ్చు.

5. అవకాడో

ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేసే అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. అవకాడో
తీసుకోవడం వల్ల చర్మంపై కొత్త కణాలు ఏర్పడతాయి. మీకు కావాలంటే మీరు చర్మం కోసం
అవోకాడో మాస్క్‌ని అప్లై చేయవచ్చు.

నిరుద్యోగులకు శుభవార్త.. CISFలో కానిస్టేబుల్ పోస్ట్‌లు.. అర్హత 12వ తరగతి.. ?

ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్యాసింజర్, స్కూల్ బస్సులలో అవి తప్పనిసరి..?

ఎల్‌ఐసీలో మీ డబ్బు నిలిచిపోయిందా.. పాలసీ డబ్బులు రీఫండ్‌ కావడం లేదా.. ఇలా చేయండి..?