AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Litchi: డయాబెటీస్‌ ఉన్నవారు లీచి పండు తినవచ్చా..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

తెల్లని జెల్లీ లాంటి గుజ్జుతో కనిపించే ఈ లిచీ పండు కేవలం వేసవిలోనే దొరుకుతుంది. వీటిని చూడగానే నోరూరుతుంది. అందుకే ఎక్కువమంది వీటిని తినడానికి ఇష్టపడతారు. అయితే, లిచీ కేవలం రుచిలోనే మాత్రమే కాదు..ఈ పండ్లలో పోషకాలు కూడా ఎక్కువే అంటున్నారు ఆరోగ్యనిపుణులు. లిచీ తినడం వల్ల శరీరానికి అధిక లాభాలు ఉన్నాయి. అయితే, డయాబెటీస్‌ ఉన్నవారు లిచీ పండ్లు తింటే ఏమౌతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Litchi: డయాబెటీస్‌ ఉన్నవారు లీచి పండు తినవచ్చా..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Litchi
Jyothi Gadda
|

Updated on: Jun 06, 2025 | 1:35 PM

Share

లిచీ పండు ఒక పోషకమైన పండు, పోషకాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఎర్రని తొక్కతో లోపల తెల్లని జెల్లీ లాంటి గుజ్జుతో కనిపించే ఈ లిచీ పండు కేవలం వేసవిలోనే దొరుకుతుంది. వీటిని చూడగానే నోరూరుతుంది. అందుకే ఎక్కువమంది వీటిని తినడానికి ఇష్టపడతారు. అయితే, లిచీ కేవలం రుచిలోనే మాత్రమే కాదు..ఈ పండ్లలో పోషకాలు కూడా ఎక్కువే అంటున్నారు ఆరోగ్యనిపుణులు. లిచీ తినడం వల్ల శరీరానికి అధిక లాభాలు ఉన్నాయి. అయితే, డయాబెటీస్‌ ఉన్నవారు లిచీ పండ్లు తింటే ఏమౌతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్న లిచీ పండ్లు సహజంగానే తీపి చక్కెరను కలిగి ఉంటాయి. వీటిని అధికంగా తినడం వల్ల త్వరగా ఊబకాయం బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే దంత క్షయం ఏర్పడే అవకాశం కూడా ఉందంటున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

ఖాళీ కడుపుతో లేదా రాత్రి పడుకునే ముందు లిచీ తినవద్దు. లిచీ పండులో 15 గ్రాముల సహజ చక్కెర ఇందులో ఉంటుంది. అంతేకాదు లిచీ పండులో గ్లైసెమిక్ సూచీ కూడా 50 కంటే ఎక్కువగా ఉంది. అయితే, ఎక్కువ మొత్తం తినడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో లిచీని తీసుకోండి. టెట్రాప్యాక్‌ల్లో అమ్మేటువంటి లిచీ లేదా లిచీ జ్యూస్ తాగడం మానుకోండి.

ఇవి కూడా చదవండి

అంతేకాదు.. అధిక రక్తపోటు ఉన్నవారు రోజుకు రెండు మూడు లిచీ పండ్లను తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ, అధికంగా తింటే మాత్రం బీపీ లెవల్స్‌ బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. దీంతో నీరసం, మూర్ఛ, అలసట వంటివి వస్తాయి. సాధారణంగానే లిచీ పండ్లను ఎక్కువగా తినడం వల్ల అనేక అలర్జీలు కలిగే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. దురద, వాపు, ఎరుపుగా మారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు.

(నోట్‌: ఈ కథనంలోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా సమస్యలున్నా.. సందేహాలు ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి