ప్రస్తుతం చాలా మంది ప్రజలు అధిక బరువు, స్థూలకాయంతో భాదపడుతున్నారు. పెరిగిపోయిన బరువు తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, సహజ పద్ధతిలో బరువు తగ్గితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.. అందులో భాగంగా మీ డైట్‌లో సొరకాయ రసం చేర్చుకోవటం వల్ల అద్భుత ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సోరకాయ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సోరకాయ రసం తాగడం వల్ల అనేక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. బరువును నియంత్రించడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సొరకాయ రసం చాలా ఉపయోగపడుతుంది. సొరకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఐరన్, బోలేట్, మెగ్నీషియం, జింక్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. నీటిశాతం కూడా ఇందులో అధికంగా ఉంటుంది. సోరకాయ తినడం వల్ల మీ పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. సోరకాయ జ్యూస్‌తో వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం…
1. సోరకాయ జ్యూస్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎందుకంటే దీన్ని తినడం వల్ల శరీరం సహజంగా డిటాక్సిఫై అవుతుంది. అందుకే రోజూ సోరకాయ జ్యూస్ చేసుకుని తాగొచ్చు.
2. సోరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గాలంటే కచ్చితంగా సోరకాయను క్రమం తప్పకుండా మీ ఆహారంలో చేర్చుకుని తినండి. ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. దీని కారణంగా మీరు అతిగా తినకుండా ఉంటారు.
3. సోరకాయ సూప్ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. దీని కోసం, సోరకాయ నీటిలో ఉడకబెట్టి, సూప్‌గా తింటే, ఇది పొట్టలోని కొవ్వును వదిలించుకోవడానికి సహాయపడుతుంది.
4. చాలా మంది సోరకాయ తొక్కను పారేస్తారు. కానీ సోరకాయ తొక్కలు కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయని మీకు తెలుసా? ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
5. సోరకాయ రసం శరీరానికి చాలా మంచిది. ఎందుకంటే సోరకాయ రసం మీ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. దీంతో మీ బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..