Upma: టిఫిన్‌గా ఉప్మా రవ్వ సూపర్.. 20 నిమిషాల్లో తయారు చేయవచ్చు..?

|

Dec 28, 2021 | 5:59 PM

Upma: ఉప్మా ఒక రుచికరమైన దక్షిణ భారతీయ వంటకం. ఇది చాలా మందికి ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇది సులభంగా తయారు చేయగల ఒక బ్రేక్‌పాస్ట్‌.

Upma: టిఫిన్‌గా ఉప్మా రవ్వ సూపర్.. 20 నిమిషాల్లో తయారు చేయవచ్చు..?
Upma
Follow us on

Upma: ఉప్మా ఒక రుచికరమైన దక్షిణ భారతీయ వంటకం. ఇది చాలా మందికి ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇది సులభంగా తయారు చేయగల ఒక బ్రేక్‌పాస్ట్‌. ఇది 20 నిమిషాల కంటే తక్కువ సమయంలో తయారు చేయవచ్చు. ఉప్మాను చాలా రకాలుగా చేసుకోవచ్చు. దీని తయారీకి సెమోలినా, బంగాళదుంప, ఉల్లిపాయ, ఆవాలు, నెయ్యి, పచ్చిమిర్చి అవసరం. ఇంట్లో సులభంగా ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు
1. సెమోలినా – 1 కప్పు
2. ఉల్లిపాయ – 1
3. ఆవాలు – 1/2 tsp
4. పచ్చిమిర్చి – 1
5. వేడినీరు – 1 1/4 కప్పు
6. చిన్న బంగాళాదుంప – 1
7. నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
8. కరివేపాకు – 10
8. ఉప్పు

1. ఈ రుచికరమైన వంటకాన్ని సిద్ధం చేయడానికి, ఉల్లిపాయలు, బంగాళాదుంపలను తొక్క తీసి చిన్నముక్కలుగా తరగాలి. తరువాత తక్కువ మంట మీద పాన్ పెట్టి దానిపై సెమోలినాను వేయించాలి. పూర్తయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత అదే పాన్‌పై నెయ్యి వేసి కరిగించాలి. దాంట్లో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. కొన్ని సెకన్ల పాటు వేయించాలి. దానికి తరిగిన ఉల్లిపాయలను కలపాలి. ఒక నిమిషం వేయించి ఆపై తరిగిన బంగాళాదుంపలను కలపాలి. రుచి ప్రకారం ఉప్పు వేసి మూతపెట్టి, పదార్థాలను ఒక నిమిషం వరకు ఉడికించాలి.

3. ఇంతలో మీడియం వేడి మీద ఒక గిన్కెలో నీటిని మరిగించండి. వేయించిన సెమోలినాను కూరగాయలలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు త్వరగా సెమోలినాలో వేడి నీరు వేసి బాగా కలపాలి. పాన్‌ను మూతతో కప్పి, ఉప్మాను ఒకటి లేదా రెండు నిమిషాలు ఉడికించాలి. తాజాగా తరిగిన కొత్తిమీర ఆకులతో అలంకరించాలి. వేడిగా వడ్డిస్తే ఉప్మాతయారీ పూర్తవుతుంది.

సెమోలినాలో పోషకాలు
సెమోలినా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. సెమోలినా మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. సెమోలినాలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

Chocolate Recipe: హాట్ చాక్లెట్‌ రెసిపీ.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ గుర్తుండిపోతాయి.. ఇంట్లోనే ఇలా చేయండి..

Corn Cutlet: పిల్లలకోసం మొక్కజొన్న కట్లెట్‌.. ఇంట్లోనే సులువుగా చేసేయ్యండి..

Sweet Potatoes: ఈ వ్యాధులు ఉంటే స్వీట్‌ పొటాటోస్‌ అస్సలు తినకూడదు..! ఎందుకంటే చాలా ప్రమాదం..?