బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేసి విసిగిపోయినవారు చాలా మందే ఉంటారు. ఉదయాన్నే వాకింగ్, జిమ్ కు వెళ్లడం.. డైటింగ్ చేయడం ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఫలితం కనిపించదు. దీంతో ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అలాంటి వారి కోసం క్యాలరీలు తక్కువగా.. పోషకాలు ఎక్కువగా ఉండే బీరకాయ రైస్ సూప్ ఎంతో మేలు. దీంతో సులభంగా బరువు తగ్గేయోచ్చు.
కావాల్సిన పదార్థాలు..
బీరకాయలు …2 తొక్క తీసి కట్ చేసుకోవాలి.
నానబెట్టిన బాస్మతీ బియ్యం.. 2 కప్పులు
నూనె.. 2 టేబుల్ స్పూన్స్
పోపు దినుసులు.. టీస్పూన్
ఎండుమిర్చి.. 3
వెల్లుల్లి తరుగు.. 2 టీ స్పూన్స్
ఉల్లిపాయ.. ఒకటి
బంగాళాదుంప.. ఒకటి.
ఎర్ర గుమ్మడి కాయ ముక్కలు.. కప్పు
పసుపు.. తగినంత
నల్ల మిరియాల పొడి.. అర టీస్పూన్
కొత్తిమీర తరుగు.. 2 టేబుల్ స్పూన్స్
నిమ్మకాయ.. ఒకటి
ఉప్పు .. తగినంత
తయారీ..
ముందుగా పాన్ లో నూనె వేడి చేసి.. అందులో పోపు దినుసులు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత అందులోనే ఎండు మిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు జత చేసి వేగనివ్వాలి బంగాళాదుంప, గుమ్మడి కాయ, బీరకాయ ముక్కలు, పసుపు, నల్ల మరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. కాస్త మగ్గిన తర్వాత బాస్మతీ బియ్యాన్ని కూడా వేయాలి. ఆ తర్వాత 2 లీటర్ల నీళ్లు పోసి కలుపుకోవాలి. చిన్న మంట మీద కూరగాయలు, బియ్యం బాగా ఉడికే వరకు కలుపుతూ ఉండాలి. ఆఖర్లో కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి మరోసారి కలిపి పక్కన పెట్టుకోవాలి.
ప్రయోజనాలు..
బరువు తగ్గేవారికి ఈ సూప్ చాలా ఉపయోగకరం. అలాగే ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వలన తేలికగా జీర్ణమవుతుంది. విటమిన్ సీ, ఐరన్, మెగ్నీషియం, థయమిన్.. వంటి పోషకాలు అధికంగా ఉండడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనతతో బాధపడే మహిళలకు బీరకాయ చాలా మంచిది.