Eggs In Summer : ఇంతకీ వేసవిలో గుడ్లు తినాలా, వద్దా..? ఆరోగ్య నిపుణుల సూచన ఏంటంటే..

|

May 09, 2024 | 9:00 AM

ఆమ్లెట్ వేసుకోండి. కానీ తక్కువ నూనె వాడండి. మీరు కూరగాయలు, చీజ్ లేదా చికెన్ వంటి వాటిని యాడ్‌ చేసుకుని ఆమ్లెట్‌ వేసుకోవటం వల్ల మీ బ్రేక్‌ఫాస్ట్‌ మరింత పోషకమైనదిగా తయారు చేసుకోవచ్చు. మీరు తీసుకునే సలాడ్‌లో తరిగిన గుడ్లను వేసుకోవటం వల్ల ప్రోటీన్ పరిమాణం పెరుగుతుంది. రుచిగా మారుతుంది. అయితే, ఇక్కడ గుడ్లను బాగా ఉడికించాలి. లేదా బాగా ఫ్రై చెయ్యాలి..

Eggs In Summer : ఇంతకీ వేసవిలో గుడ్లు తినాలా, వద్దా..? ఆరోగ్య నిపుణుల సూచన ఏంటంటే..
Eggs In Summer
Follow us on

గుడ్లు మంచి పోషకాహారం. రోజూ గుడ్డును తినడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. గుడ్డు పోషకాలు, ఖనిజాలు, విటమిన్లతో నిండిన బలవర్ధక ఆహారం. అలాంటి గుడ్డును ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరిగి పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తాయని కూడా అంటుంటారు. అయితే, ఎండాకాలం వచ్చిందంటే గుడ్లు తినడం మానేయాలి అనుకుంటారు చాలా మంది. గుడ్డు శరీర ఉష్ణోగ్రతను పెంచుతుందని నమ్ముతారు. కాబట్టి, వేసవిలో గుడ్లు తినకూడదని చెబుతారు. కానీ, వేసవిలో గుడ్డు తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

గుడ్డు తీసుకోవడం కారణంగా శరీరంలో వేడి పెరగదు. ఇందులోని సోడియం,. పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఎలక్ట్రోలైట్లు ఉన్నాయి. ఇవి ద్రవ సమతుల్యతను కాపాడుకోవడానికి కీలకమైనవి. వేడి వాతావరణంలో ఇవి తీసుకోవడం వల్ల వేడి పెరగదు. వేసవిలో గుడ్లు తీసుకోవడం వల్ల శరీరం పోషకాహార లోపంతో బాధపడకుండా ఉంటుంది. వాస్తవానికి, గుడ్లలోని విటమిన్ బి12 మరియు కోలిన్ మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాగే గుడ్లలో ఉండే ఐరన్, జింక్ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పటిష్టం చేసి వేసవి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. అల్పాహారంగా ఉడికించిన గుడ్డు తినండి. ఉడికించిన గుడ్డు సులభంగా జీర్ణమవుతుంది.

ఆమ్లెట్ వేసుకోండి. కానీ తక్కువ నూనె వాడండి. మీరు కూరగాయలు, చీజ్ లేదా చికెన్ వంటి వాటిని యాడ్‌ చేసుకుని ఆమ్లెట్‌ వేసుకోవటం వల్ల మీ బ్రేక్‌ఫాస్ట్‌ మరింత పోషకమైనదిగా తయారు చేసుకోవచ్చు. మీరు తీసుకునే సలాడ్‌లో తరిగిన గుడ్లను వేసుకోవటం వల్ల ప్రోటీన్ పరిమాణం పెరుగుతుంది. రుచిగా మారుతుంది. అయితే, ఇక్కడ గుడ్లను బాగా ఉడికించాలి. లేదా బాగా ఫ్రై చెయ్యాలి.. పచ్చి గుడ్లను తినకూడదు. వాటిలో ఒకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. అది గుడ్డును విషపూరితంగా మార్చే అవకాశం ఉంది. వేసవిలో ఈ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. అందువల్ల వేసవిలో గుడ్లు తక్కువగా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..