
వేరుశెనగలలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం అవసరంలేదు. అలాగే భారతదేశంలో దాదాపుగా అందరూ వేరుశెనగలు తింటారు. దీనిని చౌక బాదం అని కూడా పిలుస్తారు. చలికాలంలో చాలా మంది వేరుశెనగలను ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో ప్రోటీన్, ఫ్యాటీ యాసిడ్, పిండి పదార్థాలు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉండడమే ఇందుకు కారణం. అయితే ఇది కొంతమందికి చాలా హానికరం. వారికి దీని వల్ల అలర్జీ సమస్యలు ఏర్పడుతాయి. అజీర్ణంతో సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదు. రక్తపోటు, గుండె సంబంధిత రోగులు కూడా తీసుకోవద్దు. అలాగే ఎవరెవరు ఈ వేరుశెనగలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..