Diabetic Diet: డయాబెటిస్ రోగులు ఈ పదార్థాలు తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయవచ్చు… ఏంటంటే..

|

Jul 06, 2021 | 1:58 PM

డయాబెటిస్ రోగులు తమ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాలి. రోజూ తీసుకునే ఆహారం విషయంలో చేసే చిన్న చిన్న తప్పులు ఆరోగ్యంపై

Diabetic Diet: డయాబెటిస్ రోగులు ఈ పదార్థాలు తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయవచ్చు... ఏంటంటే..
Healthy Foods
Follow us on

డయాబెటిస్ రోగులు తమ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాలి. రోజూ తీసుకునే ఆహారం విషయంలో చేసే చిన్న చిన్న తప్పులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూసే అవకాశాలు ఉంటాయి. డయాబెటిస్ రోగులు వాస్తవానికి కొన్ని ఆహార పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. ముఖ్యంగా తీపి పదార్థాలను తీసుకోవడం పూర్తిగా మానుకోవాలి. అలాగే కొన్ని డ్రింక్స్ కు దూరంగా ఉండడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయవచ్చు.

చిక్కుళ్లు..
చిక్కుళ్లు, కిడ్నీ బీన్, పప్పులు తక్కువ గ్లైసెమిక్ కలిగిన పదార్థాలు. వీటి కార్బోహైడ్రేట్లు క్రమంగా విడుదలవుతాయి. వీటి వలన రక్తంలో షుగర్ లెవల్స్ పెంచే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇటీవల ఓ అధ్యయనంలో బీన్స్ వంటి పదార్థాలలో తక్కువ గ్లైసెమిక్ ఆహారాలు దాదాపు మూడు నెలలపాటు తినడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ ఎ1, సీ స్థాయిలు తగ్గుతాయని తేలింది.

ఆపిల్స్..
ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. ఇందులో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక ఆపిల్ తినడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

బాదం పప్పు..
ఇందులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ ను మరింత సమర్థవంతంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి.

బచ్చలికూర..
పాలకూరలో 21 కేలరీలు ఉంటాయి. అలాగే ఇందులో మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూరను ఆలివ్ నూనెలో వేయించి తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రిణలో ఉంటాయి.

వోట్మీల్..
ఓట్స్ గుండెకు మాత్రమే కాదు.. రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించడంలోనూ సహాయపడతాయి. ఇవి తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి.

Also Read: Revanth Reddy : రేపే పీసీసీ చీఫ్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి.. భారీ సభకు ప్లాన్.. లక్ష మంది వస్తారని అంచనా..

Mehreen Pirzada: ఫ్యామిలీ డాక్టర్ అంటే క్రష్ ఉండేది.. ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్ మెహ్రీన్..

Toshiba Inverter AC: అమెజాన్‌లో రూ.96,700 విలువైన ఇన్వర్టర్‌ ఏసీ.. కేవలం రూ.5,900లకే.. లాభపడిన కస్టమర్లు