మెంతులు వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. భారతదేశంలో అనేక శతాబ్ధాలుగా వివిధ రకాల చికిత్సలకు మెంతులను ఉపయోగిస్తారు. ముఖ్యంగా చర్మ చికిత్సలకు మెంతులను ఉపయోగిస్తారు. అలాగే వీటిని సబ్బు, షాంపూ తయారీల ఉపయోగిస్తారు. ఇందులో అనేక పోషకాలున్నాయి. ఒక టీస్పూన్ మెంతికూరలో 6 గ్రాముల కార్బోహైడ్రేట్, 3 గ్రాముల ఫైబర్, 3 గ్రాముల ప్రోటీన్, 1 గ్రాము కొవ్వు ఉన్నాయి. అంతేకాకుండా.. ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం కూడా ఉన్నాయి. మెంతులు వేడిని కలిగిస్తాయి. చలికాలంలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా.. చలికాలంలో మెంతికూర, మెంతులతో అనేక ప్రయోజనాలున్నాయి. అవెంటో తెలుసుకుందామా.
మెంతికూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవే కాకుండా.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అలాగే.. మలబద్ధకం, జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. పచ్చి మెంతికూర తీసుకోవడం జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అలాగే పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడంలోనూ సహకరిస్తాయి. చిన్న వయస్సులో నాలుగు వారాలపాటు రోజూ 500 mg మెంతులు తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు అనేక రెట్లు పెరుగుతాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా.. జుట్టు సమస్యలను తగ్గించడంలోనూ మెంతులు ఎక్కువగా ఉపయోగపడతాయి. దీని ఆకులను గ్రైండ్ చేసి జుట్టుకు పెట్టడం వలన జుట్టు ఒత్తుగా ఉంటుంది. అంతేకాకుండా.. మెంతులలో ప్రోటీన్లు, కొవ్వులు, పిండిపదార్థాలు, క్యాల్షియం, విటమిన్ ఎ,సి, కె, బి, రాగి, పీచుపదార్థం కూడా ఉంటాయి. మెంతులు ఆకలిని పెంచుతాయి. అలాగే జీర్ణశక్తిని పెంచుతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రిస్తాయి. రక్తహీనతతో బాధపడేవారికి ఔషదంలా పనిచేస్తాయి. దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్, ఛాతీ పట్టేయడం వంటి సమస్యలను నివారించడంలోనూ మెంతు ఉపయోగపడతాయి.
Also Read: Nayanthara: నయన్ బర్త్ డే స్పెషల్ సర్ప్రైజ్.. చిరు సినిమాలో లేడీ సూపర్ స్టార్ ఫిక్స్..
Tollywood Heroine: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా..?.. ఆ ఒక్క సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది
SS Rajamouli: ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం.. ఆర్‌ఆర్‌ఆర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్…