గుమ్మడి కాయ.. ఎక్కువగా ఇంటి గుమ్మాల ముందు.. నూతన గృహ ప్రవేశం రోజున మాత్రమే ఉపయోగిస్తుంటారు. ఈ గుమ్మడికాయను తినడం చాలా అరుదు. కొందరు మాత్రమే గుమ్మడి కాయను వంటల్లో ఉపయోగిస్తారు. అయితే దీంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలిస్తే కచ్చితంగా మీరు అస్సలు వదిలిపెట్టరు. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి ఇతర సమస్యలను తగ్గించడంలో గుమ్మడికాయ ఔషదంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి, ఇ, ఎ.. ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహయపడుతుంది. గుమ్మడికాయలో ఉండే విటమిన్ ఎ, కెరోటిన్, క్శాంతిన్ రోగ నిరోధక పెంచడానికి.. విటమిన్ బీ, బీ6 మంటను తగ్గించడానికి.. పీఎంఎస్ నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. గుమ్మడి కాయ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే వర్షాకాలంలో మొటిమలు, చుండ్రు సమస్యలను తగ్గిస్తుంది.
☛ శరీరంలో ఐరన్ లోపం ఉంటే.. రక్తహీనత సమస్య ఎదురవుతుంది. అలాగే మైకం.. చర్మం పసుపు రంగులోకి మారడం.. గోర్లు బలహీనంగా మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. గుమ్మడికాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కువగా తీసుకోవడం వలన ఐరన్ సమస్య తగ్గుతుంది.
☛ గుమ్మడి కాయ గుజ్జు, విత్తనాలలో విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే వర్షాకాలంలో ఎదురయ్యే అంటువ్యాధులను తగ్గించడానికి తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తాయి.
☛ ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాదు కొవ్వు కూడా తక్కువే. పైబర్ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైబర్ జీర్ణ ప్రక్రియపై ఎక్కువగా ప్రభావం చూపడమే కాకుండా.. ఆకలిని నియంత్రిస్తుంది.
☛ వర్షాకాలంలో ఎదురయ్యే జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, ఇ, సీ, ఐరన్ ఉండడం వలన రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా.. సీజనల్ వ్యాధులను తగ్గిస్తుంది.
☛ ఇవే కాకుండా.. గుమ్మడికాయలో విటమిన్ ఎ అధికంగా ఉండడం వలన కళ్లకు మేలు చేస్తుంది. అలాగే ప్రకాశించే చర్మం కోసం కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడమే కాకుండా.. మొటిమల సమస్యను నియంత్రిస్తుంది. గుమ్మడి కాయ గుజ్జుతో మాస్క్ తయారు చేసుకోవచ్చు.