Healthy Drinks: రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఆ వ్యక్తికి అన్ని రోగాలు అటాక్ అవుతాయి. తరచుగా జలుబు, దగ్గు, జ్వరం మొదలైన సమస్యలు వస్తాయి. అంతేకాదు ఈ రోజుల్లో రకరకాల వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇవి ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిపై ఎక్కువగా అటాక్ చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సెప్టెంబర్, నవంబర్ మధ్య వైరల్, డెంగ్యూ, మలేరియా, ఫ్లూ, దగ్గు మొదలైనవి ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. వాటిని నివారించడానికి మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకు ఈ 3 ఆరోగ్యకరమైన పానీయాలు చక్కగా పనిచేస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.
1. జీలకర్ర, బెల్లం పానీయం
జీలకర్ర, బెల్లం కలిపిన పానీయం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శ్లేష్మాన్ని తొలగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడతాయి. బలహీనతతో జ్వరం లేదా ఇన్‌ఫెక్షన్‌కి గురయ్యే వారికి ఎంతో మేలు చేస్తాయి. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒకటిన్నర గ్లాసుల నీటిని వేడి చేయాలి. తర్వాత దానికి ఒక చెంచా జీలకర్ర కొంత బెల్లం కలపాలి. దానిని బాగా మరిగించి ఫిల్టర్ చేసి టీ లాగా తీసుకోవాలి. ఇది మీ శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
2. పసుపు పాలు
పసుపును పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో వాడుతున్నారు. ఇందులో యాంటీసెప్టిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. నిద్రించే సమయంలో పసుపు పాలను ప్రతిరోజూ తీసుకుంటే ఇన్ఫెక్షన్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
3. తులసి గిలోయ్ టీ
ఈ సీజన్‌లో తులసి, గిలోయ్ టీ కూడా చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. దీన్ని చేయడానికి, ఒక గ్లాసు నీటిలో 8 తులసి ఆకులు, జిలోయ్ స్టిక్స్ కలపాలి. ఇది కాకుండా అల్లం, నల్ల మిరియాలు, పసుపు కలపాలి. ఆ తర్వాత నీటిని సగం వరకు మిగిలేలా మరిగించాలి. దాన్ని ఫిల్టర్ చేసి నిమ్మరసం, ఒక చెంచా తేనె కలుపుకొని తాగాలి. ప్రతి ఉదయం పరగడుపున ఈ పానీయం తాగడం వల్ల రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి.