చింతచిగురులోని ఔషధ విలువలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..! చింతలన్నీ దూరం చేసే దివ్యౌషధం

|

Jan 29, 2024 | 9:39 PM

అంతేకాదు, చింత చిగురు ర‌క్తాన్ని శుద్ధి చేస్తుంది. మ‌హిళ‌ల్లో నెల‌స‌రి స‌మ‌స్య‌లు దూరం చేస్తుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి విముక్తిని కలిగిస్తుంది. చింతచిగురు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారికి సహాయపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫినాల్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చెడు కొవ్వును తగ్గించి మంచి కొవ్వును పెంచుతాయి. ఇది జీర్ణవ్యవస్థను కూడా బలపరుస్తుంది.

చింతచిగురులోని  ఔషధ విలువలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..! చింతలన్నీ దూరం చేసే దివ్యౌషధం
Tamarind Leaves
Follow us on

చింత చిగురు…గ్రామాల్లో నివసించేవారు, లేదంటే గ్రామాల నుంచి వచ్చిన వారికి బాగా తెలుసు.. సీజనల్ గా చింత చెట్టుకు కాచే లేలేత ఆకులనే చింతచిగురు అంటారు. దీంతో పప్పు, పచ్చడి, నాన్‌వెజ్‌ వంటకాలు చేసుకుని తింటారు. ముఖ్యంగా పల్లెటూళ్లలో చింతచిరుగుతో పప్పును చాలమంది లొట్టలేసుకుని తింటారు. అంతేకాదు.. చింతచిగురు ఎండు చేపలు కాంబినేషన్‌ చాలా మంది ఇష్టపడతారు. చింత చిగురుకు ఉండే సహజమైన పులుపు కారణంగా కూరల రుచి రెట్టింపు అవుతుంది. అంతేకాదు..చింతచిగురు ప్రయోజనాలు తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు..ఇది రుచికరమైనది మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ముఖ్యంగా చింతచిగురులో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి12 .. వంటి వాటితో పాటు యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి కారణంగా సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు రోగ నిరోదక శక్తి పెంచుతుంది.

ముఖ్యంగా చింతచిగురుతో చేసిన వంటకాలు తినడం వల్ల జీర్ణ సమస్యలు దురమవుతాయి. కడుపులో నులి పురుగులతో బాధ పడే వాళ్ళు చింతచిగురు రసం పడగడుపున తాగితే వాటి నుంచి విముక్తి కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చింతచిగురును ఉడికించి ఆ నీటిని ప్రతిరోజూ నోట్లో వేసుకొని పుక్కలించడం వల్ల నోటి దుర్వాసన దూరమవుతుంది. చింతపండులో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను నియంత్రిస్తుంది. చింతపండు చిన్న పిల్లలకు మంచి శక్తిని ఇస్తుంది.

చింతపండు ఆకుల రెమ్మకు కామెర్లు నయం చేసే గుణం కూడా ఉంది. చింతపండు రెమ్మల రసాన్ని బెల్లం కలిపి తీసుకుంటే పచ్చకామెర్లు ఉన్నవారికి మేలు చేస్తుంది. చింతపండును ఆహారంలో తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. గొంతునొప్పి, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలకు చింతచిగురు కూడా బాగా పనిచేస్తుంది. అంతేకాదు, చింత చిగురు ర‌క్తాన్ని శుద్ధి చేస్తుంది. మ‌హిళ‌ల్లో నెల‌స‌రి స‌మ‌స్య‌లు దూరం చేస్తుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి విముక్తిని కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

చింతచిగురు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారికి సహాయపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫినాల్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చెడు కొవ్వును తగ్గించి మంచి కొవ్వును పెంచుతాయి. ఇది జీర్ణవ్యవస్థను కూడా బలపరుస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..