Swiggy Reveals 2021: ఈ సంవత్సరం మొదటి ఓటు బిర్యానికే.. తర్వాత సమోస, గులాబ్‌జామ్‌..

Swiggy Reveals 2021: ఫుడ్ డెలివరీ భాగస్వామి స్విగ్గీ తన ఆరో వార్షిక గణాంకాల నివేదికను విడుదల చేసింది. ఇందులో అనేక ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వచ్చాయి.

Swiggy Reveals 2021: ఈ సంవత్సరం మొదటి ఓటు బిర్యానికే.. తర్వాత సమోస, గులాబ్‌జామ్‌..
Swiggy Reveals 2021
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Dec 22, 2021 | 6:55 AM

Swiggy Reveals 2021: ఫుడ్ డెలివరీ భాగస్వామి స్విగ్గీ తన ఆరో వార్షిక గణాంకాల నివేదికను విడుదల చేసింది. ఇందులో అనేక ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వచ్చాయి. ఈసారి అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్ బిర్యానీ. ఈ ఏడాది స్విగ్గీకి ప్రతి నిమిషానికి 115 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. తర్వాతి స్థానంలో గులాబ్ జామూన్ రస్మలై ఉన్నాయి. మరోవైపు స్నాక్స్‌లో దేశీ సమోసా అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత పావ్‌భాజీ ఉంది. ఈ ఏడాది స్విగ్గీ యాప్‌లో పావ్‌భాజీకి సంబంధించిన 21 లక్షల ఆర్డర్‌లు వచ్చాయి. ఆసియా గురించి మాట్లాడుతూ.. భారతీయ, చైనీస్ ఆహారాలు టాప్ 3 వంటకాలలో ఉన్నాయి. తర్వాత మెక్సికన్, కొరియన్ వంటకాలు ఉన్నాయి. ఈ నివేదికలో మరిన్ని విషయాలు బయటపడ్డాయి.

ఈ సంవత్సరం ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు ఈ సంవత్సరం కోవిడ్ సమయంలో ప్రజలు ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ వహించారు. నివేదిక ప్రకారం.. ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే రెస్టారెంట్లకు డిమాండ్ పెరిగింది. 2021లో స్విగ్గిలో ఆరోగ్యకరమైన ఆహారం కోసం సెర్చ్‌లు రెట్టింపు అయ్యాయి. ఈ రెస్టారెంట్లు ఆర్డర్‌లలో 200 శాతం పెరిగాయి. బెంగుళూరు వాసులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్, ముంబై నిలిచాయి.

కీటో, వేగన్ ఫుడ్ ఆర్డర్లు పెరిగాయి నివేదిక ప్రకారం.. స్విగ్గీ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లో కీటో ఆర్డర్‌లు 23 శాతం పెరిగాయి. వేగన్ ఫుడ్ ఆర్డర్‌లు కూడా 83 శాతం వృద్ధిని నమోదు చేశాయి. స్టాటిస్టిక్స్ ఆర్డర్ విశ్లేషణ అనేది ఫుడ్ డెలివరీ, ఇన్‌స్టామార్ట్‌లోని కిరాణా, Swiggy Genie, HealthHub ద్వారా పికప్ అండ్ డ్రాప్ సర్వీస్‌తో సహా Swiggy అందుకున్న ఆర్డర్‌లపై ఆధారపడి ఉంటుంది.

చెన్నైలో డెలివరీ బాయ్‌కి 6000 టిప్‌ చెన్నై దేశవ్యాప్తంగా అత్యంత ఉదారవాద నగరంగా అవతరించింది. ఇక్కడ ఒక స్విగ్గీ డెలివరీ భాగస్వామికి కేవలం ఒక ఆర్డర్ కోసం రూ.6,000 టిప్ ఇచ్చారు. Swiggy నివేదిక ప్రకారం.. రాత్రి 10 గంటల తర్వాత, చీజ్ గార్లిక్ బ్రెడ్, పాప్‌కార్న్, ఫ్రెంచ్ ఫ్రైస్‌ల కోసం కంపెనీకి అత్యధిక ఆర్డర్లు వచ్చాయి. రాత్రి 7-9 గంటల మధ్య సమయం డెలివరీ భాగస్వాములకు అత్యంత రద్దీగా ఉండే సమయం.

పండ్లు, కూరగాయలు, ఇన్‌స్టామార్ట్ 2021లో 28 మిలియన్ల పండ్లు, కూరగాయలను పంపిణీ చేసింది. టొమాటో, అరటిపండు, ఉల్లిపాయ, బంగాళదుంప, పచ్చి మిరపకాయలు టాప్ 5 ఆర్డర్ చేసిన పండ్లు, కూరగాయలలో ఉన్నాయి. ఆహారం, కిరాణా తర్వాత, జెనీ డెలివరీకి సంబంధించిన టాప్ 3 కేటగిరీలలో మందులు ఉన్నాయి. జెనీ ఆర్డర్‌లలో దాదాపు 48 శాతం ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ ఆర్డర్‌లలో 20,000 పెంపుడు జంతువుల కోసం వచ్చినవి. జెనీపై ‘మెడిసిన్’ కేటగిరీలో 288.79 శాతం పెరుగుదల నమోదైంది.

3 లక్షల శానిటరీ న్యాప్‌కిన్స్‌ డెలివరీ ఇన్‌స్టామార్ట్ 1 లక్ష మాస్క్‌లతో పాటు, 4 లక్షలకు పైగా సబ్బులు, హ్యాండ్‌వాష్‌లను పంపిణీ చేసింది. అదే సమయంలో, 70,000 బ్యాండ్-ఎయిడ్స్, 55000 డైపర్ల ప్యాక్‌లు, 3 లక్షల శానిటరీ నాప్‌కిన్‌ల ప్యాక్‌లు కూడా పంపిణీ చేసింది.

డెలివరీ బాయ్ 42, 55 కి.మీ ప్రయాణం.. నివేదిక ప్రకారం.. బెంగళూరుకు చెందిన స్విగ్గీ జెనీ డెలివరీ భాగస్వామి ఆక్సిజన్ ఫ్లోమీటర్‌ను అందించడానికి 42 కి.మీ ప్రయాణించారు. అదే సమయంలో బెంగళూరులో ఆహార ప్యాకేజీ డెలివరీ కోసం, భాగస్వామి 55.5 కి.మీ. అతి తక్కువ దూరం 200 మీటర్లు.

బూస్టర్‌ డోస్‌ తీసుకుంటే రూ.7500 నగదు బహుమతి..! ఈ ఆఫర్ డిసెంబర్‌ 31లోపు మాత్రమే..?

’83’ సినిమాపై పన్ను మినహాయింపు.. సినీ ప్రేమికులకు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గిఫ్ట్‌

Zero Rupee Note: ఇండియాలో జీరో రూపాయి నోట్లను ముద్రించారు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ