ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా జోన్న రెట్టెల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జొన్న రొట్టెల వల్ల ఎంతో చక్కటి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. జొన్న రొట్టెల్లో పీచు పదార్థాలు, ప్రొటీన్లు ఎన్నో దాగి వున్నాయి. జీర్ణ వ్యవస్థను ఇది ఎంతో చక్కగా ఉంచుతుంది. ప్రతి రోజూ జొన్నలను మన డైట్‌లో చేర్చుకుంటే, మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. జొన్నలు నిత్యం మన జీవక్రియలకు అవసరమైన, శరీర అభివృద్ధికి ఉపయోగపడే మాంసకృత్తులు, పిండిపదార్ధాలు, ఫైబర్, ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు, ఫోలిక్ ఆమ్లం వంటి పోషకాలున్న జొన్న ధాన్యంలో సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందించి ఎనర్జీ బూస్టర్ గా సహాయపడతాయి. కనుక జొన్నలను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
జొన్నలలో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియ సక్రమంగా ఉండటానికి తోడ్పడుతుంది. జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, టైప్ టు డయాబెటీస్ వంటి వ్యాధులు దరిచేరకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొటెక్ట్ చేస్తాయి.జొన్నలను ఎక్కువగా తీసుకునే వాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. జొన్నలు కడుపులో నొప్పి, వాంతులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తాయి. వీటిలో విటమిన్ బీ6 అధికంగా ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన ఆహారపదార్థాలు పెట్టడం ఎంతో మంచిది.
జొన్నలు మధుమేహాన్ని కూడా చాలా వరకు అదుపులో ఉంచుతుంది. జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, టైప్ టూ డయాబెటీస్‌ని యాంటీ ఆక్సిడెంట్స్ కంట్రోల్ చేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా గోధుమలు, బియ్యం, మొక్కజొన్న తర్వాత ఎక్కువగా పండించేది జొన్న పంటే. మధుమేహ వ్యాధి ఉన్నవారు ఎక్కువగా జొన్న రొట్టెలు తినడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో కాల్షియం అధిక మోతాదుతో ఉంటుంది. జొన్న తినడం వల్ల మీ ఎముకలు కూడా బలపడతాయి. జోవర్‌లో అధిక-ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో మేలు చేస్తుంది. అనారోగ్యమైన సమస్యలు రాకుండా సహాయపడుతుంది. జొన్న తినడం వల్ల మీ రక్త ప్రసరణ పెరుగుతుంది. చర్మ వ్యాధులు రాకుండా కూడా నివారిస్తుంది. జొన్నలతో రోటీ, కేకులు, చిల్లా, కుకీలు, బ్రెడ్ మొదలైన వెరైటీ వెరైటీ వంటకాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి