Raw Mango Juice: సమ్మర్ సూపర్ డ్రింక్.. పచ్చిమామిడితో షరబత్.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. తయారీ విధానం..

|

Apr 22, 2022 | 10:37 AM

Raw Mango Juice: వేసవి వచ్చిందంటే చాలు.. పండ్లలో రారాజు మామిడి వైపే అందరి చూపు.. పచ్చిమామిడితో చేసే అనేక రకాల వంటకాలు ఆహార ప్రియులకు నోరూరిస్తుంటాయి. మామిడి తో రకరకాల నిల్వ పచ్చళ్ళు..

Raw Mango Juice: సమ్మర్ సూపర్ డ్రింక్.. పచ్చిమామిడితో షరబత్.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. తయారీ విధానం..
Raw Mango Panna Recipe
Follow us on

Raw Mango Juice: వేసవి వచ్చిందంటే చాలు.. పండ్లలో రారాజు మామిడి వైపే అందరి చూపు.. పచ్చిమామిడితో  చేసే అనేక రకాల వంటకాలు ఆహార ప్రియులకు నోరూరిస్తుంటాయి.  మామిడి తో రకరకాల నిల్వ పచ్చళ్ళు(Mango Pickle) తయారు చేస్తారు. ఇక మామిడి పండు.. పండ్లకే రారాజు.. అయితే పచ్చి మామిడిలోని శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే గుణాలున్నాయని ఆయుర్వేదం(Ayurveda) పేర్కొంది. వేసవి తాపాన్ని తట్టుకుని శరీరంలోని డీహైడ్రేషన్ ని నివారించేలా మామిడికాయతో షరబత్ తాగుతారు. దీనినే కొందరు ఆమ్ పన్నా అని కూడా అంటారు. ఇది శరీరం వేడిని తట్టుకోవడమే కాదు.. శరీరం డీహైడ్రేషన్ కి గురికాకుండా చూస్తుంది. ఆమ్ పన్నాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వేసవిలో అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. మరి పచ్చిమామిడితో షరబత్ తయారీ గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు: 

పచ్చి మామిడి కాయ – 1/2కేజీ
పుదీనా -టేస్ట్ కు సరిపడా
చక్కెర – 1 కప్పు
నల్ల ఉప్పు -ఒక స్పూన్
వేయించిన జీలకర్ర పొడి -ఒక టేబుల్ స్పూన్
మిరియాల పొడి -అర స్పున్
ఉప్పు -రుచికి సరిపడా
ఐస్ స్క్యూబ్స్ – మూడు
నీరు- 2 లీటర్లు

తయారీ విధానం: ముందుగా పచ్చి మామిడికాయలను తీసుకుని శుభ్రం చేసుకోవాలి.. తొక్క తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పుదీనా ఆకులను తీసుకుని ఓ పక్కకు పెట్టుకోవాలి. అనంతరం స్టౌ వేలించి.. పాన్ పెట్టి.. మామిడి ముక్కలను టెంక వేసుకుని కొంచెం సేపు మరిగించాలి. అనంతరం పంచదార, ఉప్పు, నల్ల ఉప్పు, మిరియాలు, వేయించిన జీలకర్ర పొడి వేసి.. పుదీనా ఆకులూ వేసుకుని స్విమ్ లో పెట్టుకుని ఒక అరగంట పాటు మరిగించాలి.

అనంతరం స్టౌ మీద నుంచి దింపులు.. మామిడి మిశ్రమాన్ని చల్లారబెట్టాలి. అనంతరం టెంక తీసేసి.. ఈ మిశ్రమాన్ని.. మిక్సీలో వేసి.. గ్రైండ్ చేయాలి.  ఈ మిశ్రమం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే.. దాదాపు 15 రోజులు నిల్వ ఉంటుంది.  తాగే ముందు.. ఒక గ్లాసులో తయారు చేసుకున్న మామిడి సిరప్ వేసుకుని.. తర్వాత ఐస్ క్యూబ్స్, కొన్నీ పుదీనా ఆకులు వేసుకుని తగినంత నీరు కలుపుకోవాలి. అంతే పుల్లపుల్లని టేస్టీ టేస్టీ మామిడి షరబత్ రెడీ.. ఇది చల్లగా తాగుతుంటే చాలా రుచిగా, హాయిగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది. మరింకెందుకు ఆలస్యం ఈరోజే సమ్మర్ స్పెషల్ కూల్ డ్రింక్ ఆమ్ పన్నా తయారు చేసుకోండి..

 

Also Read: Tirumala: శ్రీవారి ఆలయంలో ఒక మూలకు వచ్చేసరికి.. చాలా మంది భక్తులు.. ఆగి.. తలెత్తి.. చూస్తుంటారు ఎందుకంటే

Train on Road: రోడ్డుపై రైలు పరుగులు.. విద్యార్ధుల కోసం ఓ స్కూలు యాజమాన్యం వినూత్న ప్రయోగం