Sugar vs Honey vs Jaggery: ఫిట్నెస్ మీద దృష్టి పెట్టిన వారు పాటించాల్సిన మొదటి నియమం చక్కెర వాడకాన్ని తగ్గించడం.. ఇంకా చెప్పాలంటే చక్కెర వినియోగాన్ని పూర్తిగా మానేయడం కూడా అత్యుత్తమం. రోజు రోజుకీ ప్రజల్లో ఫిట్నెస్ పై పెరుగుతున్న సృహతో చక్కెరకు ప్రత్యామ్న్యాయంగా బెల్లం లేదా తేనె వైపు చూస్తున్నారు. అయితే ఫిట్నెస్ ను తీపి పదార్ధాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి..? ఆరోగ్యానికి చక్కెర కు బదులు తేనె లేదా బెల్లం ఏది మంచిది.. ఈరోజు తెలుసుకుందాం..!
చక్కెర అంటే ప్రాసెస్డ్ షుగర్ .. ఇది శుద్ధి చేయబడింది. దీనిలో అత్యధిక కేలరీలు నిండి ఉంటాయి. ఎక్కువగా చక్కెర ను తీసుకుంటే బరువుపెరుగుతారు. అంతేకాదు మధుమేహానికి గురయ్యే పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. గుండెపని తీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే తేనె లో యాంటీఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. బెల్లం లో ఐరెన్ అధికంగా ఉంటుంది. దీంతో ఈ రెండిటిని చక్కెరకు బదులుగా మితంగా ఉపయోగించడం మంచిది.
శుద్ధి చేసిన చక్కెరలో అత్యధిక కేలరీలు ఉంటాయి. ఇక దీనిలో ఉండే ఫ్రక్టోజ్ కాలేయ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. దీంతో ఆల్కహాల్ అలవాటు లేని వారి కూడా కాలేయ వ్యాధులకు కారణమవుతుంది. అంతేకాదు చక్కెర దంతాల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది.
ఇక చక్కెర లో ఇన్సులిన్ స్థాయిని పెంచే గుణం ఎక్కువ.. దీంతో ఎక్కువ కాలం చక్కెర వాడుతున్నవారు బరువు పెరగడం, మధుమేహం, గుండె పనితీరు, కాలేయ పని తీరు పై ప్రభావం చూపిస్తుంది.
తేనె మరియు బెల్లం రెండూ ఒకే రకమైన కేలరీలను కలిగి ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. బెల్లం, తేనెలో ఐరన్, ఫాస్పరస్ మరియు కాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. చక్కెర , బెల్లం రెండూ చెరకు నుంచి తయారు చేయబడినవే.
బెల్లంలో అధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది శరీర పనితీరుని సక్రమం చేస్తుంది. ఇక తేనె ను వేడి నీతితో కలిసి తాగితే జీవక్రియ వేగవంతమవుతుంది. అంతేకాదు వీడి నీటిలో నిమ్మరసం తేనె కలిసి తాగినా శరీరంలోని మలినాలను శుద్ధి చేస్తుంది. తేనెలో అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు , అవసరమైన పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
మరోవైపు బెల్లం శుద్ధి చేసిన చక్కెరతో సమానమైన కేలరీలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిని తక్షణమే పెంచుతుంది. అయితే బరువు తగ్గాలని ప్రయత్నించేవారికి, డయాబెటీక్స్‌కు బెల్లం కంటే.. తేనె ఉత్తమం. అయితే చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయని, ఆరోగ్యానికి మంచిదని తేనె, బెల్లం వీటిని ఎక్కువగా తీసుకుంటే.. చక్కెర తరహాలోనే ప్రమాదకరంగా మారతాయి.