Prawns Dum Biryani : రొయ్యల తో ఈజీగా ధమ్ బిర్యానీ తయారు చేయడం ఎలా..?
ఆదివారం వచ్చిందంటే చాలు రెగ్యులర్ ఫుడ్ కు చెక్ చెప్పి.. డిఫరెంట్ ఫుడ్ ను తిండడానికి పిల్లలైనా. పెద్దలైనా ఆసక్తి చూపిస్తారు..ఎక్కువ మంది బిర్యానీని తినడానికి ఇష్టపడతారు.. దీంతో సన్ డే వస్తే చాలు...
Prawns Dum Biryani : ఆదివారం వచ్చిందంటే చాలు రెగ్యులర్ ఫుడ్ కు చెక్ చెప్పి.. డిఫరెంట్ ఫుడ్ ను తిండడానికి పిల్లలైనా. పెద్దలైనా ఆసక్తి చూపిస్తారు..ఎక్కువ మంది బిర్యానీని తినడానికి ఇష్టపడతారు.. దీంతో సన్ డే వస్తే చాలు ప్రతి తల్లి.. డిఫరెంట్ గా బిర్యానీ ఎలా చేయాలి అని ఆలోచిస్తుంది. అయితే ప్రస్తుతం రకరకాల బిర్యానీలు వచ్చాయి. ఈరోజు సీఫుడ్ లో రారాజు రొయ్యల తో ధమ్ బిర్యానీ చేయడం నేర్చుకుందాం..!
రొయ్యల ధమ్ బిర్యానికి కావలసిన పదార్థాలు:
రొయ్యలు- కేజీన్నర బాస్మతి బియ్యం- ఒక కేజీ పెరుగు- 200 గ్రాములు నిమ్మరసం- మూడు టీస్పూన్లు కారంపొడి- 20 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ – 100 గ్రాములు, ఉప్పు- రుచికి సరపడినంత గరంమసాలా- 20 గ్రాములు నూనె – సరిపడినంత ఉల్లి ముక్కలు-వేగించినవి జీడిపప్పు – కొద్దిగా కొత్తిమీర పుదీనా బిర్యానీ ఆకులు డాల్డా లేదా నెయ్యి
తయారీ విధానం :
ఒక గిన్నెలో రొయ్యలు వేసి వాటిలో నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్ట్, గరంమసాలా, వేగించిన ఉల్లి ముక్కలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు, ధనియాల పొడి, నూనె వేసి మాగ్నెట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు గంటలపాటు అలాగే ఉంచాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో గరం మసాలా, బిర్యానీ ఆకులు వేయాలి. నీళ్లు మరిగాక కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అందులో వేయాలి. బియ్యం సగం ఉడికాక నీళ్లు వంపేయాలి. తర్వాత అన్ని వైపులా సమంగా ఉన్న గిన్నె తీసుకుని అందులో ముందుగా మాగ్నెట్ చేసుకున్న రొయ్యల్ని ఒక పొరలా వేయాలి. వాటిపైన సగం ఉడికించిన బిర్యానీ రైస్‌ను ఒక పొరలా పరవాలి. పైన కొంచెం నెయ్యి వేయాలి. ఇలా లేయర్స్‌గా మాగ్నెట్ చేసుకున్న రొయ్యల్ని తర్వాత బిర్యానీ రైస్‌ను వేసుకోవాలి. తర్వాత ఆ గిన్నెను స్టౌపై ఉంచి సన్నటి మంట మీద 25 నిమిషాల పాటు ఉడికించాలి. అనంతరం వేగించిన ఉల్లి ముక్కలను పరచుకోవాలి. తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా గిన్నెను, మూతను కలిపి మైదాతో మూసేయాలి. 20 నిమిషాల తర్వాత మూతను తీసి కొత్తిమీర, పుదీనాల తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించాలి. అంతే రుచికరమైన నోరూరించే రొయ్యల ధమ్ బిర్యాని రెడీ. ఈ రొయ్యల బిర్యానిని ఏమీ కలుపుకోకుండా అలానే తిన్నా రుచిగా ఉంటుంది. పెరుగు చట్నీ (రైతా) తో తిన్నా బాగుంటుంది.
పెరుగు చట్నీకి కావాల్సిన పదార్ధాలు :
చిక్కటి పెరుగు చిన్నగా సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ తురుము రుచికి సరపడినంత ఉప్పు వీటన్నిటిని ఓ గిన్నెలో వేసుకుని కలుపుకుని ఉప్పు చూసుకుంటే సరిపోతుంది.
Also Read: జీవితం బోర్ కొడుతుందని.. యూట్యూబ్ లో సెర్చ్ చేసిమరీ ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడు