Sprouted Nuts : ఉదయమే మొలకెత్తిన గింజలు తింటున్నారా..! అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి..
Sprouted Nuts Benefits : మెులకెత్తిన గింజలు తినడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచచ్చు. వాటిలో ఉండే
Updated on: Mar 23, 2021 | 8:41 AM

మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, ఫోలేట్, విటమిన్ సి విటమిన్ కె లాంటి అద్భుతమైన పోషకాలు ఉంటాయి. మొలకెత్తిన గింజలలో ఉండే ప్రోటీను నిల్వలు సులభంగా జీర్ణమవుతాయి. వీటి వల్ల పోషకాలను శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: మొలకెత్తిన గింజలు అధిక మొత్తాలలో సజీవ ఎంజైములను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను పెంచి శరీరంలోని రసాయనిక చర్యలను మెరుగుపరచడంలో సహకరిస్తాయి.

మొలకెత్తిన గింజలను తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని ద్వారా గుండె నొప్పిలాంటి సమస్యలు ఉండవు.

మొలకెత్తిన గింజల్లో ఉండే ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వాటిలో ఉండే ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చూసి ఆకలి తొందరగా కలగకుండా చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచడానికి . . విటమిన్ ' C ' మొలకెత్తిన గింజల్లో ఎక్కువగా ఉండడం వల్ల తెల్ల రక్త కణాలు (WBCs) శక్తివంతంగా పనిచేయడంలో తోడ్పడుతుంది. తద్వారా రోగనిరోధక శక్తిని పెంచగలుగుతుంది.



