Bangalore Crime News : జీవితం బోర్ కొడుతుందని.. యూట్యూబ్ లో సెర్చ్ చేసిమరీ ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడు
బెంగళూరు సిలికాన్ సిటీలోని ఓ ప్రైవేట్ సంస్థలో టీమ్ లీడర్ గా ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మార్చి 13 మహాదేవ్ పూర్ లో...
Bangalore Crime News : బెంగళూరు సిలికాన్ సిటీలోని ఓ ప్రైవేట్ సంస్థలో టీమ్ లీడర్ గా ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మార్చి 13 మహాదేవ్ పూర్ లో జరిగింది. మృతుడు బీదర్ కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
జీవన్ అంబటి అనే యువకుడు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. మార్చి 13 న ఇంటర్నెట్‌లో ఆత్మహత్య చేసుకోవడం ఎలా అని పరిశోధించిన తర్వాత ఈ యువకుడు ఆత్మహత్య కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకోవడం ఎలా.. ఈజీగా ఎలా మరణిస్తామో యూట్యూబ్‌లో వెదికిన జీవన్ గ్యాస్ సిలిండర్‌లోని మోనాక్సైడ్ పీలిస్తే ఈజీగా మరణిస్తామని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ముఖానికి ముసుగు ధరించి ముక్కులోకి సిలిండర్ పైపు పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శరీరం లోపలకి మోనాక్సైడ్ వెళ్లి మరణించాడు. అయితే జీవన్ ఆత్మహత్య చేసుకునే ముందు ఓ రేఖాచిత్రాన్ని ఇంటి గుమ్మం ముందు అతికించాడు. అంతేకాదు.. తన ఇంటిలోపలికి అడుగు పెట్టేముందు ఏమి చెయ్యాలో కూడా వివరంగా రాసి పెట్టాడు. తనకు మరణం పెద్ద విషయం కాదని.. ఎవరైనా ఇంటి తలుపు తెరచిన వెంటనే కిటికీలు ముందు తెరవమని.. ఎవరూ లైట్లు ఆన్ చేయవద్దు.. లైటర్ వెలిగించవద్దు అని సూచించాడు. జీవన్ ఆత్మహత్య చేసుకున్న మూడు రోజున తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
జీవన్ స్నేహితులు ఫోన్ చేసినా జీవం లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చినవారు ఇంటికి వచ్చి చూశారు.. ఆత్మహత్య చేసుకునే ముందు ఓ లెటర్ రాసినట్లు తెలుస్తోంది. స్నేహితులు మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
జీవన్ రాసిన డెత్‌నోట్‌లో ఏముంది?
నాకు ఫోన్ లేదు, నా గురించి నేను పట్టించుకోను. జీవితం చాలా అందమైంది.. అయితే తనకు జీవితం విసుకు తెప్పిస్తుందని లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు జీవన్ .
Also Read: ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’.. ఉత్తమ తెలుగు దర్శకుడు ఎవరంటే..?
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 8వ తరగతి అర్హతతో సైనిక్ స్కూల్ లో ఉద్యోగావకాశాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!