Amarnath Yatra 2021: భక్తుల నిరీక్షణకు తెర.. అమర్‌నాథ్ యాత్రకు మార్గం సుగమం.. తేదీలను ప్రకటించిన బోర్డు
Shri Amarnath Yatra 2021 Schedule: అమర్‌నాథ్ యాత్రకు మార్గం సుగమం అయింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్రను ఈ ఏడాది తిరిగి ప్రారంభించిందుకు అధికారులు సన్నాహాలు
Shri Amarnath Yatra 2021 Schedule: అమర్‌నాథ్ యాత్రకు మార్గం సుగమం అయింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్రను ఈ ఏడాది తిరిగి ప్రారంభించిందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఈ మేరకు అమర్‌నాథ్ బోర్డు ఈ ఏడాది యాత్ర తేదీలను సైతం ప్రకటించింది. 2021 అమర్‌నాథ్ తీర్థయాత్ర జూన్ 28న ప్రారంభమై.. ఆగస్టు 22 వరకు కొనసాగుతుందని ప్రకటించింది. మొత్తం మీద అమర్‌నాథ్ యాత్ర 56 రోజుల పాటు కొనసాగనుంది. పూర్తిస్థాయి కోవిడ్ నిబంధనలతో ఈ యాత్ర కొనసాగుతుందని బోర్డు వెల్లడించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ తేదీలను సైతం ప్రకటించింది.
ఏప్రిల్ 1 నుంచి భక్తులు అమర్‌నాథ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. దీనికి సంబంధించి బ్యాంకుల వివరాలను ప్రకటించింది. ఇటీవల జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి రెండు మార్గాల ద్వారా యాత్ర ప్రారంభంకానుంది. 13 ఏళ్లలోపు పిల్లలను, 75ఏళ్లు పైబడిన వృద్ధులను యాత్రకు అనుమతించరు. హెలికాప్టర్ సదుపాయం కూడా ఉంటుంది.
కాగా.. ప్రతీ ఏడాది వేసవి కాలంలో అమర్‌నాథ్ యాత్ర జరుగుతుంది. అయితే గతేడాది కరోనావైరస్ మహమ్మారి కారణంగా అమర్‌నాథ్ యాత్రను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతోపాటు అంతకుముందు 2019 ఆగస్టు 5న జమ్ము కాశ్మీర్‌లో ఆర్టికల్స్ 370, 35-ఏ ను రద్దు చేయడం, పూర్వ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం, ఉగ్రవాద దాడుల కారణంగా కూడా అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. అయితే ఈ ఏడాది జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో యాత్రను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.
రెండేళ్ల అనంతరం అమర్‌నాథ్ యాత్ర ప్రారంభిస్తుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమరనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు సమాయత్తమవుతున్నారు.
Also Read: