AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food: ఈ నత్తల కూర వరల్డ్ ఫేమస్.. ఇంతకీ వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

తమిళనాడు గ్రామీణ వంటకాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. న్యూయార్క్‌కు చెందిన చెఫ్ విజయ్ కుమార్ ప్రతిష్టాత్మక జేమ్స్ బియర్డ్ అవార్డు గెలుచుకోవడం ఈ గుర్తింపునకు ప్రధాన కారణం. ఆయన మెనూలో నత్త మాంసంతో చేసే 'నత్తై పెరాట్టల్' వంటి గ్రామీణ, ప్రాంతీయ వంటకాలు ఉన్నాయి. చెఫ్ విజయ్ తన స్వగ్రామంలోని సాధారణ వంటకాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. నత్తలు, కీటకాలు వంటి అసాధారణ పదార్ధాలతో చేసే ఆహారాన్ని ఇది భారతదేశ వంటకాల వైవిధ్యాన్ని చాటి చెబుతుంది.

Food: ఈ నత్తల కూర వరల్డ్ ఫేమస్.. ఇంతకీ వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Snails Curry Tamilnadu
Bhavani
|

Updated on: Jul 15, 2025 | 8:41 PM

Share

నత్తై పెరాట్టల్ అనే నత్త మాంసపు వంటకం ఇటీవల చాలా ప్రాచుర్యం పొందింది. న్యూయార్క్ చెఫ్ విజయ్ కుమార్ జూన్ నెలలో ‘బెస్ట్ చెఫ్: న్యూయార్క్ స్టేట్’ విభాగంలో జేమ్స్ బియర్డ్ అవార్డు గెలుచుకున్నప్పటి నుంచి ఇది ప్రాచుర్యం పొందింది. ఆయన మెనూలో తన స్వగ్రామమైన తమిళనాడు గ్రామీణ ప్రాంతానికి చెందిన సంప్రదాయ వంటకాలు చాలా ఉన్నాయి. చిన్నప్పుడు సెలవులకు తమ తాతయ్య ఇంటికి వెళ్లినప్పుడు చేపలు పట్టడం, వేటాడడం, నత్తలు వెతకడం వంటి పనులలో బిజీగా ఉండేవాడినని చెఫ్ విజయ్ తెలిపారు.

నత్తలు, చెదలు నిర్దిష్ట కాలంలో మాత్రమే లభిస్తాయి. వాటిని బయట కొనలేం. నదులు ఎండిపోయినప్పుడు నత్తలు దొరకవు. వర్షం పడిన ఒకటి లేదా రెండు రోజుల తర్వాత నదీ పడకలపై చెదలు గుంపులు గుంపులుగా వస్తాయి. కానీ, చిన్న నీటి ఆనవాళ్లు కనిపించినా అవి మాయమైపోతాయి. అందుకే, సరైన సమయం వచ్చినప్పుడు, చాలా సార్లు, మొత్తం గ్రామం కలిసి వాటిని సేకరించి వంటకాలు చేసుకుంటారు” అని తెలిపారు.

సంప్రదాయ గ్రామీణ వంటకాలు..

పుదుక్కోట్టై జిల్లాలోని చిన్న వీరమంగళం గ్రామం నుంచి పనిచేసే VCC బృందం.. రెక్కల చెదలను వేటాడి, వాటితో వంటలు చేసే వీడియోలను మొదటగా చేసింది. 2018లో విడుదలైన ఈ ఎపిసోడ్ ఎనిమిది మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. ఇది పట్టణ ప్రాంతాలలో చాలా అరుదుగా కనిపించే వంటకాలను చూపించడానికి VCC బృందానికి మార్గం చూపింది.

“ఆహార ఎంపికల విషయంలో ప్రజలు చాలా విమర్శనాత్మకంగా ఉంటారు. మా ‘ఈసల్’ వంటకానికి ఎలాంటి స్పందన వస్తుందో మొదట్లో మేము ఆందోళన పడ్డాం. కానీ, సానుకూల స్పందనలు మేము సరైన మార్గంలో ఉన్నామని నమ్మకాన్ని ఇచ్చాయి. మేము నత్త వంటకాలపై మూడు వీడియోలు విడుదల చేశాం, వాటికి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది,” అని సుబ్రహ్మణ్యన్ చెప్పారు.

నత్తలు సాధారణంగా నదీ పడకల వృక్షాల చుట్టూ గుంపులుగా ఉంటాయి. కుటుంబాలు మట్టి కుండలతో నదిలోని నిస్సార ప్రదేశాలలో నత్తలను తీయడానికి వెళ్తాయి. “నత్తలను సేకరించిన తర్వాత, వాటిని నీటిలో రాత్రంతా నానబెడతారు. ఇలా చేయడం ద్వారా వాటిలోని మలినాలు తొలగిపోతాయి. నత్త మాంసాన్ని సన్నటి కర్రతో బయటకు తీసి, కొన్ని నిమిషాలు మంటపై వండుతారు. మసాలాలు ఎక్కువగా లేకుండా, ఎండుమిర్చి, ఉప్పు, చిన్న ఉల్లిపాయలు కలిపి రుబ్బి, ఆ మాంసాన్ని తీయాలి. ఆ తర్వాత గుల్లలు పారేయాలి” అని సుబ్రహ్మణ్యన్ వివరించారు.

ఊమాచి (చిన్న నత్తలు):

ఊమాచి అనే చిన్న నత్తలను వాటి గుల్లలతోనే వండుతారు. తినేటప్పుడు గుల్ల లోపల ఉన్న మాంసాన్ని ఉప్పు, మిరియాలు కలిపి రుచి చూస్తారు.

మత్స్యకారులకు పండగే..

మత్స్యకారులు నత్తలను తరచుగా తింటారు. చెన్నైలోని కాసిమేడు చేపల మార్కెట్లో జనవరి, ఫిబ్రవరి నెలలలో నత్తలు దొరుకుతాయి. “సీజన్ లో నత్తలపై 10,000 మంది మత్స్యకార కుటుంబాలు ఆధారపడతాయి” అని మత్స్యకారుడు ఎం. సుమన్ వివరించారు. ఒక కిలో సముద్రపు నత్తలు రూ.200 వరకు ఉంటాయి. “వాటిని పట్టుకోవడానికి, మత్స్యకారులు టన్నుల కొద్దీ నిల్వ చేపలను వలలో కట్టి రాత్రంతా నీటిలో ముంచెత్తుతారు,” అని పులికాట్ కు చెందిన మత్స్యకారుడు చెప్పారు.

నత్తలు ఆ వాసనకు ఆకర్షితమై వలలకు అతుక్కుపోతాయి. నత్తలను పట్టుకోవడం శ్రమతో కూడుకున్న పని. వాటి మొత్తం బరువులో 25% మాత్రమే మాంసం ఉంటుంది. మిగిలినది గుల్ల. సముద్రపు నత్తలకు మెరిసే తెల్లటి గుల్ల ఉండగా, మంచి నీటి నత్తలు గోధుమ రంగులో ఉంటాయి సుమన్ అన్నారు. “రెండూ రుచికరమైనవి, కానీ సముద్రపు నత్తలు దొరకడం కష్టం కాబట్టి అవి మరింత ప్రత్యేకమైనవి,” అని చెప్పారు. మాంసాన్ని తీయడానికి ముందు వాటిని ఉడకబెడతారు. “తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, మిరియాలు, కారం, జీలకర్ర కలిపి మాంసాన్ని వేయించి, అన్నంతో తినడానికి వీలైన సెమీ-గ్రేవీని తయారు చేస్తారు” అని వివరించారు. పులికాట్‌లో మత్స్యకారులు తమ వలలో చిక్కుకున్న నత్తలను సేకరిస్తారు. వాటి మాంసం మటన్ కన్నా రుచిగా ఉంటుందట. మత్స్యకారులు నత్తలు తినడం చర్మానికి మంచిదని నమ్ముతారు. ఇలా విభిన్న ఆహార అలవాట్లతో తమిళులు వార్తల్లో నిలుస్తున్నారు.