Weight Loss Breakfast: బెల్లీ ఫ్యాట్ మంచులా కరిగిపోతుంది..! బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ మూడు ఆహారాలను తీసుకోవటం అలవాటు చేసుకోండి..

|

Sep 09, 2023 | 7:01 AM

ఇది మిమ్మల్ని ఎక్కువసే కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది మిమ్మల్ని అతిగా తినకుండా ఆపుతుంది. త్వరగా బరువు తగ్గాలనుకుంటే ఉప్మా మీకు బెస్ట్‌ బ్రేక్‌ ఫాస్ట్‌గా చె్ప్పొచ్చు. ఇందులో నువ్వుల పిండి, ఉప్పుడు పిండితో చేసే ఉప్మా బరువు నియంత్రణలో సహాయపడుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ను ప్రోత్సహిస్తుంది. కానీ తయారుచేసేటప్పుడు నూనె తక్కువగా వాడటం మంచిది.

Weight Loss Breakfast: బెల్లీ ఫ్యాట్ మంచులా కరిగిపోతుంది..! బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ మూడు ఆహారాలను తీసుకోవటం అలవాటు చేసుకోండి..
Breakfast
Follow us on

బరువు తగ్గడం చాలా కష్టం. పొత్తికడుపు, నడుము భాగంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గాలంటే ఉదయం నుంచి దానిపై శ్రద్ధ పెట్టాలి. అంటే ఉదయం పూట ఎంత ఆరోగ్యంగా తింటున్నారో, అంత ఫిట్ గా ఉంటారు. నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది స్థూలకాయానికి గురవుతున్నారు. అటువంటి సందర్భంలో మీరు మీ బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. దీని కారణంగా పెరిగిన బరువు కొన్ని వారాలలో తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, మన రోజు ప్రారంభం మంచిగా ఉండాలి. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి , ఈజీగా బరువును తగ్గించుకోవటానికి మన బ్రేక్ ఫాస్ట్ లో ఇలాంటి పదార్థాలను చేర్చుకోవడం చాలా అవసరం.

బరువు తగ్గడానికి తీసుకోవాల్సిన బ్రేక్ ఫాస్ట్..

పొట్టలో పేరుకుపోయిన కొవ్వు పైకి అసహ్యంగానే కనిపిస్తుంది. అంతేకాదు.. ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు.. అనేక వ్యాధులకు కారణమవుతుంది. అధిక బరువు గుండె జబ్బులు, అధిక రక్తపోటు, యూరిక్ యాసిడ్, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి సకాలంలో అధిక బరువు తగ్గడం మంచిది. బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని రకాల ఆహారపదార్థాలను చేర్చుకుంటే, పొట్టలోని కొవ్వు త్వరగా తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అదేంటో చూద్దాం…

ఇవి కూడా చదవండి

1. నిమ్మరసం, తేనె :

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండుకుని, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే పొట్ట కొవ్వు, బరువు తగ్గుతాయి. దీనికి ఒక చెంచా తేనె కలుపుకుంటే మంచిది.

2. పెరుగు:

క్యాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్న పెరుగు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అలాగే, ఇది శరీరంలోని ప్రోటీన్ మొత్తాన్ని నియంత్రిస్తుంది. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలనుకునే వారు తమ బ్రేక్‌ఫాస్ట్‌లో ఫైబర్, ప్రోటీన్‌తో కూడిన పెరుగును చేర్చుకోవచ్చు.

3. ఉప్మా:

ఉప్మాని మీ బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవటం వల్ల కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉప్మా నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఇది మిమ్మల్ని ఎక్కువసే కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది మిమ్మల్ని అతిగా తినకుండా ఆపుతుంది. త్వరగా బరువు తగ్గాలనుకుంటే ఉప్మా మీకు బెస్ట్‌ బ్రేక్‌ ఫాస్ట్‌గా చె్ప్పొచ్చు. ఇందులో నువ్వుల పిండి, ఉప్పుడు పిండితో చేసే ఉప్మా బరువు నియంత్రణలో సహాయపడుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ను ప్రోత్సహిస్తుంది. కానీ తయారుచేసేటప్పుడు నూనె తక్కువగా వాడటం మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..