Weight Loss: బరువు తగ్గాలనుకునేవారికి రైస్ బెస్టా.? రోటీ బెస్టా.? షాకింగ్ విషయాలు.!

| Edited By: Anil kumar poka

Oct 16, 2021 | 5:04 PM

'ఆరోగ్యమే మహాభాగ్యం' అనే నానుడి మీకు తెలిసే ఉంటుంది. అసలే ఇప్పుడు కరోనా కాలం కావడంతో అందరూ కూడా ఆరోగ్యంపై..

Weight Loss: బరువు తగ్గాలనుకునేవారికి రైస్ బెస్టా.? రోటీ బెస్టా.? షాకింగ్ విషయాలు.!
Rice Vs Chapati
Follow us on

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే నానుడి మీకు తెలిసే ఉంటుంది. అసలే ఇప్పుడు కరోనా కాలం కావడంతో అందరూ కూడా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. జిమ్, యోగా, ఎక్సర్‌సైజులు అంటూ ఒకటేమిటి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ వారిని ఓ ప్రశ్న తికమకపెడుతోంది. బరువు తగ్గడానికి రైస్ బెస్టా.? రోటీ బెస్టా.? అసలు బరువు తగ్గాలనుకునేవారు రైస్ తినడం మానేయాలా.? దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.!

బరువు తగ్గాలనుకునేవారు సడెన్‌గా తమ డైట్‌లో మార్పులు చేసేస్తారు. ఇక అలా చేయడం సరికాదని వైద్య నిపుణులు అంటున్నారు. ఎప్పటినుంచో ఫాలో అవుతున్న డైట్‌ను ఒక్కసారిగా మార్చుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. మొదటిగా బరువు తగ్గాలనుకుంటే.. ఆహారంలో కార్బ్స్ తగ్గించాలని సూచిస్తున్నారు. అయితే ఈ కార్బ్స్ అటు రైస్‌లోనూ, ఇటు రోటీలోనూ ఉండటం గమనార్హం. అందుకే ముందుగా ఆహారం క్వాంటిటీని తగ్గించండి.

ఇదిలా ఉంటే.. చపాతీ, అన్నం రెండూ కూడా వాటి స్వంత లక్షణాలను కలిగి ఉంటాయి. చపాతీ ఆకలిని తీరిస్తే.. అన్నంలోని పిండి పదార్ధం త్వరగా జీర్ణమవుతుంది. ఈ రెండింటిలోనూ సోడియం లెవెల్స్ మాత్రమే తేడాగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అన్నారు. బియ్యంలో సోడియం కంటెంట్ తక్కువగా ఉంటే.. బ్రెడ్, చపాతీలలో 190 మి.గ్రా సోడియం ఉంటుంది. చపాతీ కంటే బియ్యంలో ఫైబర్, ప్రోటీన్, కొవ్వు శాతం తక్కువ ఉంటుంది. అలాగే బియ్యంలో క్యాలరీలు కూడా ఎక్కువ ఉంటాయి.

మరోవైపు చపాతీలో లభించే కాల్షియం, పొటాషియం, ఐరన్, పాస్పరస్ వంటి పోషకాలు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఇక రైస్‌లో అయితే పొటాషియం, పాస్పరస్ తక్కువగా ఉంటాయి.. కాల్షియం అస్సలు ఉండదు. అందుకే ఆరోగ్యకరమైన డైట్‌ను ఫాలో కావాలనుకునేవారు అన్నం, చపాతీ.. రెండింటిని తీసుకోవచ్చు. అదే బరువు తగ్గాలనుకునేవారు చపాతీ తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

Read Also: రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే చక్కటి నిద్ర మీ సొంతం.. ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.!

30 ఏళ్లుగా కూరగాయలు తినని మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

గజరాజుకు కోపం వచ్చేసింది.. కారును అమాంతం ఎత్తిపడేసింది.. వైరల్ వీడియో.!

ఈ ఫోటోలలో చిరుతలను గుర్తించండి.. కనిపెట్టడం కష్టమే.. అంత ఈజీ కాదండోయ్!