ఉదయాన్నే పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం..!

|

Apr 16, 2024 | 8:55 AM

వివిధ క్యాన్సర్లతో పోరాడడంలో పచ్చి కొబ్బరి సమర్థవంతమైన ఔషధం. చర్మం, జుట్టు సంరక్షణకు పచ్చి కొబ్బరి మంచి ఎంపిక. కొబ్బరిలో ఉండే ఆరోగ్యకర కొవ్వులు చర్మానికి పోషణను ఇస్తాయి. చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు పచ్చి కొబ్బరిని క్రమం తప్పకుండా తినాలి. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.

ఉదయాన్నే పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం..!
Raw Coconut
Follow us on

సంవత్సరం పొడవునా కొబ్బరికాయలు మనకు అందుబాటులోనే ఉంటాయి. పచ్చి కొబ్బరి, కొబ్బరి నూనెతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలోని ఔషధ గుణాల వల్ల కొబ్బరిని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తుంటారు. పచ్చి కొబ్బరి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని నిపుణులు చెబుతున్నారు. పచ్చి కొబ్బరిని తినడం వల్ల శరీరానికి కాపర్, సెలీనియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ సి, ఫోలేట్ కొబ్బరిలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే చాలా మంది ఉదయాన్నే పచ్చి కొబ్బరి తింటే కడుపునొప్పి, దగ్గు, వంటి సమస్యలు వస్తాయని సంకోచిస్తుంటారు. కానీ, పరగడుపున వారానికి మూడు సార్లు చిన్న పచ్చి కొబ్బరి ముక్కను తింటే శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోండి.

పచ్చి కొబ్బరిని క్రమం తప్పకుండా తినడం వల్ల మీ శరీరానికి శక్తి వేగంగా వస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను మంచి కొలెస్ట్రాల్‌గా మారుస్తుంది. పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మధుమేహం రాకుండా ఉండాలంటే రోజూ పచ్చి కొబ్బరిని తినండి. పచ్చి కొబ్బరిలో ఉన్న కొలెస్టాల్ గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా చేస్తుంది. దీనిలో ఉండే కీటోజెనిక్ గుణాలు అల్జీమర్స్ వ్యాధి వ్యాపించకుండా చేస్తాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కొబ్బరి వల్ల చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి. ఇందులోని ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ సమస్యలు రావు. మలబద్దకం సమస్యను దూరం చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరిలో ఎక్కువగా ఉండే సెలీనియం, మెగ్నీషియం హ్యాపీ హార్మోన్ల ఉత్పత్తిని పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది మంచి మూడ్‌కు కారణమవుతాయి. అంతేకాదు ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గిస్తాయి. నిద్రలేమిని తొలగిస్తాయి. మంచి నిద్రకు కారణమవుతాయి.

వివిధ క్యాన్సర్లతో పోరాడడంలో పచ్చి కొబ్బరి సమర్థవంతమైన ఔషధం. చర్మం, జుట్టు సంరక్షణకు పచ్చి కొబ్బరి మంచి ఎంపిక. కొబ్బరిలో ఉండే ఆరోగ్యకర కొవ్వులు చర్మానికి పోషణను ఇస్తాయి. చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు పచ్చి కొబ్బరిని క్రమం తప్పకుండా తినాలి. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. పచ్చి కొబ్బరిని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఇన్పెక్షన్లు రాకుండా కాపాడతాయి. అలా అని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..