AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papaya: ఈ సమస్యలు ఉన్నవారు బొప్పాయి అస్సలు తినకూడదు..! ఎందుకో తెలుసా..?

Papaya: ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండే బొప్పాయి అత్యంత పోషకాలు కలిగిన పండ్లలో ఒకటి. దీన్ని సలాడ్‌లలో కలుపుకొని తినవచ్చు. బొప్పాయి అద్భుతమైన

Papaya: ఈ సమస్యలు ఉన్నవారు బొప్పాయి అస్సలు తినకూడదు..! ఎందుకో తెలుసా..?
Papaya
uppula Raju
| Edited By: |

Updated on: Nov 29, 2021 | 5:59 PM

Share

Papaya: ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండే బొప్పాయి అత్యంత పోషకాలు కలిగిన పండ్లలో ఒకటి. దీన్ని సలాడ్‌లలో కలుపుకొని తినవచ్చు. బొప్పాయి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఉదయం లేదా భోజనం తర్వాత దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆకలి బాధలు తగ్గుతాయి. ఇది గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, తక్కువ రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే కొంతమంది మాత్రం బొప్పాయి అస్సలు తినకూడదు. ఎందుకో తెలుసుకుందాం.

1. గర్భిణీలు గర్భిణీల ఆరోగ్యానికి, బిడ్డ ఎదుగుదలకు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. కానీ బొప్పాయి పండుని ఈ జాబితా నుంచి మినహాయించాల్సిన అవసరం ఉంది. ఈ పండులో లేటెక్స్ ఉంటుంది ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుంది. దీనివల్ల నెలలు నిండకముందే ప్రసవానికి గురయ్యే అవకాశం ఉంది. ఇది పాపైన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది పిండానికి మద్దతు ఇచ్చే పొరను బలహీనపరుస్తుంది. సగం పండిన బొప్పాయిల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంది.

2. గుండె వ్యాధులు ఉన్నవారు బొప్పాయి తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు కానీ మీరు ఇప్పటికే గుండె సమస్యలని ఎదుర్కొంటున్నట్లయితే దీనిని తినకపోవడమే మంచిది. బొప్పాయిలో తక్కువ మొత్తంలో సైనోజెనిక్ గ్లైకోసైడ్ ఉంటుంది. ఇది మానవ జీర్ణవ్యవస్థలో హైడ్రోజన్ సైనైడ్‌ను ఉత్పత్తి చేయగల అమైనో ఆమ్లం అని ఒక అధ్యయనం సూచిస్తుంది. ఇది ఆరోగ్యానికి హానికరం కానప్పటికీ దాని ప్రభావం హృదయ స్పందన సమస్యతో బాధపడుతున్న వ్యక్తుల లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. ఇది హైపోథైరాయిడిజంతో బాధపడేవారిపై ఇదే ప్రభావాన్ని చూపుతుంది.

3. అలెర్జీలు ఉన్న వ్యక్తులు అలెర్జీతో బాధపడుతున్న వ్యక్తులు బొప్పాయికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇందులో చిటినాసెస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్‌ల వల్ల తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, కళ్ళలో నీరు కారడానికి దారితీస్తుంది. కొంతమందికి పండిన బొప్పాయి వాసన కూడా అసహ్యంగా అనిపిస్తుంది.

4. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు బొప్పాయిలో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. కానీ ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు దీనిని తినడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. ఇది మూత్రం వెళ్ళడం కష్టతరం చేస్తుంది.

రికార్డ్‌లు క్రియేట్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్.. ఏ ఇండియన్‌ ఆటగాడు చేయలని ఫీట్‌ సాధించాడు..

Mobil Phones: ఈ 4 ఫోన్‌లు 6000mAh బ్యాటరీతో వస్తాయి.. ధర కేవలం రూ. 7299 మాత్రమే..

Chicken: సండే వస్తే చికెన్ తప్పనిసరి.. కానీ ఈ విషయం తెలిస్తే నిర్ణయం మార్చుకుంటారు..?

సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.