Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peanut: పల్లీలను ఇలా పొట్టుతో సహా తింటే ఏమౌతుందో తెలిస్తే ఇక విడిచిపెట్టరు..

అలాగే గర్భిణులు, బాలింతలు తీసుకుంటే మాంసకృత్తులు సమృద్ధిగా లభిస్తాయి. వేరుశనగతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. పల్లీలతోపాటు ఆహారంలో పల్లీ నూనెను కూడా ఉపయోగించవచ్చు అంటున్నారు. పల్లీలను డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ పల్లిలో మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను కూడా తగ్గిస్తాయి అని నిపుణులు చెబుతారు. అయితే,

Peanut: పల్లీలను ఇలా పొట్టుతో సహా తింటే ఏమౌతుందో తెలిస్తే ఇక విడిచిపెట్టరు..
Peanut
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 12, 2025 | 1:26 PM

గుప్పెడు వేరుశనగలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు చెక్‌ పెట్టొచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. గుప్పెడు వేరుశనగలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల ప్రాణాంతక వ్యాధులకు చెక్‌ పెట్టొచ్చు. అంతేకాదు.. రోజూ గుప్పెడు వేరుశెనగలు తీసుకోవటం వల్ల బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు సైతం ఐస్‌క్రీంలా కరిగిస్తుందట. ఇందులో క్యాల్షియం, పాస్పరస్, ఐరన్, జింక్, బోరాన్‌ లాంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. పల్లీలలో ఫైబర్‌ కూడా పుష్కలంగా ఉంటుంది. వీటి వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, పల్లీలను పొట్టుతో తినటం వల్ల కలిగే లాభాలు తెలిస్తే..

తరచూ పల్లీలు తీసుకోవటం వల్ల ప్రాణాంతక వ్యాధులైన కేన్సర్, గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేరుశనగలోని ఫైబర్‌, యాంటిఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు శరీర ఆరోగ్యానికి సహకరించి ఆయుష్షును పెంచుతాయని అంటున్నారు. వేరుశెనగను రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల విటమిన్‌ ఇ, పాలీఫెనాల్స్‌ లాంటి యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. అధిక బరువు, ఆర్థరైటిస్ నివారణకు వేరుశెనగ తోడ్పడుతుందట. దీనిలోని ఇనుము రక్తహీనతను నివారించి హీమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది.

పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు వేరుశనగను మించిన ఔషధం లేదు. అలాగే గర్భిణులు, బాలింతలు తీసుకుంటే మాంసకృత్తులు సమృద్ధిగా లభిస్తాయి. వేరుశనగతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. పల్లీలతోపాటు ఆహారంలో పల్లీ నూనెను కూడా ఉపయోగించవచ్చు అంటున్నారు. పల్లీలను డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ పల్లిలో మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను కూడా తగ్గిస్తాయి అని నిపుణులు చెబుతారు.

ఇవి కూడా చదవండి

అయితే ఉడకబెట్టిన పల్లీలను తొక్కతో సహ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పల్లీలను తొక్కతో సహా తీసుకోవటం వల్ల మంట, వాపు, దురదలు కూడా తగ్గిపోతాయి. అంతేకాదు ఇది రక్తప్రసరణ కూడా మెరుగు చేస్తుంది. తరచూ పొట్టతో సహా పల్లీలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధి సోకకుండా కాపాడతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..