Stuffed Tomatoes: సైడ్ డిష్ కోసం బెస్ట్ ఎంపిక స్టఫ్డ్ టొమాటోలు.. రుచిలో అద్భుతమైన వీటిని ఎలా చేసుకోవాలంటే

విదేశాల నుంచి మన దేశంలో అడుగు పెట్టిన టమాటోకి ప్రత్యేక స్థానం ఉంది. దేశీ కూరగాయల్లో ప్రముఖ స్థానం చోటు సంపాదించుకుంది. టమాటో లేని కూర ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఆరోగ్యానికి మేలు చేసే టమాటాతో అనేక రకాల ఆహారపదార్ధాలను చేస్తారు. అటువంటి వాటిల్లో స్టఫ్డ్ టమోటాలు ఒకటి. స్టఫ్డ్ టొమాటోలు ప్రత్యేకమైన సైడ్ డిష్ కోసం సరైన ఎంపిక. ఇవి టర్కీ, ఇరాన్, అజర్ బైజాన్, అర్మేనియా, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, అర్జెంటీనా, ఉరుగ్వే, రొమేనియా వంటి దేశాల్లో ప్రసిద్ది చెందిన వంటకం. ఈ రోజు స్టఫ్డ్ టమోటాలు తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

Stuffed Tomatoes: సైడ్ డిష్ కోసం బెస్ట్ ఎంపిక స్టఫ్డ్ టొమాటోలు.. రుచిలో అద్భుతమైన వీటిని ఎలా చేసుకోవాలంటే
Stuffed Tomatoes

Updated on: Aug 14, 2025 | 3:38 PM

భారతీయ వంటల్లో టమాటోకి ప్రత్యేక స్థానం ఉంది. టమాటోలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శక్తివంతమైన యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తాయి. అన్ని కాలాల్లో లభించే టమాటోలను తినడం వలన డాక్టరుతో అవసరముండదని చెబుతారు. టమాటోలతో చేసే వంటల్లో స్టఫ్డ్ టమోటాలు వెరీ వెరీ స్పెషల్. విదేశాల నుంచి మన దేశంలోకి అడుగు పెట్టిన స్టఫ్డ్ టమోటాలు రుచిలో అద్భుతంగా ఉంటాయి. స్టఫ్డ్ టమోటాలు ఇంట్లో వాళ్లకే కాదు, అతిథులకు కూడా నచ్చే డిష్. దీన్ని తయారు చేయడం కొంచెం కష్టమైన పని అనిపిస్తుంది. అయితే దీనిని రుచి చూసిన తర్వాత మీ కష్టాన్ని మరిపించేలా టేస్ట్ ఉంది అని అనుకుంటారు. స్టఫ్డ్ టమోటాలను ఇంట్లో తయారు చేసుకోవచ్చు. రెసిపీని తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు:

  1. బంగాళాదుంపలు – 2 మీడియం సైజు (ఉడికించినవి)
  2. టమోటాలు – 4-5 మీడియం సైజ్ లో (గట్టిగా గుండ్రంగా ఉండే టమోటాలు)
  3. పనీర్ – 1/2 కప్పు (తురిమినది)
  4. ఉల్లిపాయ – 1/2 (సన్నగా తరిగిన)
  5. ఇవి కూడా చదవండి
  6. పచ్చిమిర్చి – 1-2 (సన్నగా తరిగినవి)
  7. అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
  8. పసుపు పొడి – 1/2 టీస్పూన్
  9. ధనియాల పొడి – 1 టీస్పూన్
  10. గరం మసాలా – 1/2 టీస్పూన్
  11. కారం – 1/2 టీస్పూన్ (రుచికి తగినంత)
  12. ఉప్పు – రుచికి సరిపడా
  13. నూనె – 2-3 టేబుల్ స్పూన్లు
  14. కొత్తిమీర – సన్నగా తరిగినది

తయారీ విధానం:

  1. ముందుగా టమోటాలను బాగా కడిగి.. ఇప్పుడు టమాటా పై భాగాన్ని కత్తితో కత్తిరించి పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక చిన్న చెంచా సహాయంతో టమోటా లోపలి నుంచి గుజ్జును జాగ్రత్తగా తీయాలి. ఈ సమయంలో టమోటా పగిలిపోకుండా జాగ్రత్త వహించాలి.
  3. ఇప్పుడు ఒక పాన్ లో 1 టీస్పూన్ నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి లేత గులాబీ రంగులోకి మారే వరకు వేయించాలి.
  4. ఇప్పుడు అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి కొన్ని సెకన్ల పాటు వేయించాలి.
  5. పసుపు, కొత్తిమీర, ఎర్ర కారం, ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపండి.
  6. ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా చేసి,.. ఈ పేస్ట్ కి పన్నీర్ ని కూడా జోడించండి.
  7. ఇవన్నీ బాగా కలిసేలా చేసి వీటిని మూడు నిమిషాల పాటు వేయించాలి.
  8. చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసి కలపండి. ఈ స్టఫింగ్ ను చల్లబరచండి.
  9. ఇప్పుడు రెడీ చేసుకున్న టమోటాలను తీసుకుని టమాటా లోపల సిద్ధం చేసిన స్టఫింగ్‌ను జాగ్రత్తగా నింపండి.
  10. టమోటా లోపల ఖాళీ స్థలం లేకుండా స్టఫింగ్‌ను తేలికగా నొక్కండి.
  11. ఇప్పుడు టమోటాలను ముందుగా కట్ చేసిన ముక్కలను మూతలుగా పెట్టి స్టపింగ్ ను కవర్ చేయండి.
  12. దీని తరువాత మిగిలిన నూనెను నాన్-స్టిక్ పాన్‌లో వేసి నూనెను వేడి చేయండి.
  13. ఇప్పుడు స్టఫ్డ్ టమోటాలను ఒక పాన్ లో పెట్టి పాన్ మీద మూత పెట్టి తక్కువ మంట మీద ఉడికించండి.
  14. ప్రతి 2-3 నిమిషాలకు టమోటాలను జాగ్రత్తగా తిప్పుతూ ఉండండి. ఇలా చేయడం వలన టమాటాలు అన్ని వైపుల బాగా ఉడికి ముదురు రంగులోకి మారతాయి.
  15. ఇలా టమోటాలు మెత్తగా అయ్యే వరకు తక్కువ ఉడికించాలి. తర్వాత గ్యాస్ ఆపి..పాన్ నుంచి స్టఫ్డ్ టమోటాలు ఒక ప్లేట్ లోకి తీసుకుని మీకు ప్రియమైన వారికి అందించండి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..