వర్షాకాలం ప్రారంభమైంది. ప్రస్తుత కరోనా పరిస్థితులతోపాటు.. వర్షకాలంలో వచ్చే అనేక సమస్యల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇక వర్షాకాలంలో చర్మ సమస్యలు మరింత వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే కాకుండా.. వర్షాకాలంలో చర్మాన్ని కాపాడుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* ఇవి వేసవి కాలంలో ముగింపు దశలో వస్తాయి. వీటిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి ప్రీ రాడికల్స్ వలన కలిగే సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాకుండా.. లిట్చి, పియర్, బెర్రీలు, పీచు వంటి పదార్థాలతోపాటు.. విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లను ఈ వర్షకాలంలో తీసుకోవడం మంచింది.
* వర్షాకాలంలో బయట దొరికే ఫుడ్ తీసుకోవడం మానుకోవడం మంచిది. ప్రతి రోజూ.. పకోడీలు, సమోసాలు తినడం వలన చర్మం పొడిగా మారడంతోపాటు.. కాంతిని కోల్పోతుంది.
* ఈ వర్షాకాలంలో చర్మ సమస్యలకు చెక్ పెట్టడానికి నీరు ఎక్కువగా తాగాలి. నీరు ఎక్కువగా తీసుకోవడం వలన హైడ్రేట్ గా ఉంటారు. అలాగే పండ్ల రసాలు, గ్రీన్ టీ, సూప్స్ తాగడం మంచిది.
* పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడి కాయ గింజల్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన చర్మ సమస్యలను తగ్గించడమే కాకుండా.. చర్మం అందంగా కనిపిస్తుంది.
* వర్షాకాలంలో చర్మ సమస్యలతోపాటు.. ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే.. ముందుగా అధికంగా స్వీట్స్ తినడం మానుకోవాలి. ఈ కాలంలో ఎక్కువగా చెక్కర, స్వీట్స్ తీసుకోవడం వలన మొటిమలు ఏర్పరిచే ఆండ్రోజెన్ స్రావం పెరుగుతుంది.