Hot Masala Kichidi : ఇంట్లోనే వేడి వేడి మసాలా కిచిడీని తయారు చేయండి..! ఎలాగో తెలుసుకోండి..

Hot Masala Kichidi : వర్షాకాలంలో ఇంట్లో వేడి వేడిగా ఏదైనా తింటే ఆ కిక్కే వేరప్ప..! అందుకే సులువుగా అందరు చేసే మసాలా కిచిడీ గురించి

Hot Masala Kichidi : ఇంట్లోనే వేడి వేడి మసాలా కిచిడీని తయారు చేయండి..! ఎలాగో తెలుసుకోండి..
Hot Masala Kichidi

Updated on: Jul 02, 2021 | 9:50 AM

Hot Masala Kichidi : వర్షాకాలంలో ఇంట్లో వేడి వేడిగా ఏదైనా తింటే ఆ కిక్కే వేరప్ప..! అందుకే సులువుగా అందరు చేసే మసాలా కిచిడీ గురించి తెలుసుకుందాం. దీనిని తక్కువ సమయంలో సులువుగా చేయవచ్చు. అంతేకాదు ఇది చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యకరమైనది కూడా. దాదాపుగా కిచిడీని చాలామంది ఇళ్లలోనే చేస్తారు. ఉదయం పూట కొంతమంది టిఫిన్‌కి బదులుగా కిచిడీని తింటారు. రోజులో మూడ్ బాగా లేకున్నా కిచిడీ తింటే సరైపోతుంది. ఖిచ్డి ఆరోగ్యకరమైన బియ్యం, కూరగాయల వంటకం. దీనిని చాలా మసాలా దినుసులను వేసి చేయడం వల్ల రుచిగా ఉంటుంది. ఇంట్లో కారంగా, రుచికరమైన మసాలా ఖిచ్డిని తయారు చేయడమే కాకుండా రెసిపీని కూడా సిద్దం చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.

1. ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. తరువాత 1 అంగుళం దాల్చినచెక్క, 1 లవంగం, చిటికెడు ఆసాఫోటిడా, తరిగిన పచ్చిమిర్చి, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపండి.

2. మీడియం సైజు ఉల్లిపాయ పేస్ట్, తరిగిన టమాటా ముక్కలుగా, 3-4 స్పూన్ గ్రీన్ బఠానీలు, 1 క్యారెట్, 1 క్యాప్సికం సన్నని మంటపై కొన్ని నిమిషాలు వేయించాలి.

3. ఇప్పుడు మసాలా దినుసులను కుక్కర్‌లో వేయాలి. వీటిలో స్పూన్ పసుపు, స్పూన్ మిరప పొడి, స్పూన్ గరం మసాలా, రుచి ప్రకారం ఉప్పు కలపండి.

4. చివరగా కప్పు రైస్, కప్ మూంగ్ దాల్, 3 కప్పుల నీరు కలపాలి. మీడియం మంట మీద 4-5 ఈలలు వరకు ఉడికించి వేడి వేడిగా వడ్డించండి.

UAE Ban Travel :14 దేశాలకు ప్రయాణ నిషేధం విధించిన యూఏఈ..! భారత్, పాకిస్తాన్‌ తో సహా ఈ దేశాలకు వెళ్లలేరు..

Covid-19 Vaccine: కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే ముందు పెయిన్‌ కిల్లర్స్‌ వాడవద్దు.. హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో

Best Sleep: నిద్రలేమితో బాధపడుతున్నారా..? మంచి నిద్ర పోవాలంటే ఈ పదార్థాలు తీసుకోండి..!

ISRO Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇస్రోలో 160 ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు