Makar Sankranti 2025: మకర సంక్రాంతి రోజున నువ్వులు, వేరుశనగతో టేస్టీ టేస్టీ ఆహారాన్ని ఇంట్లోనే చేసుకోండి.. రెసిపీ మీ కోసం

|

Jan 06, 2025 | 8:06 PM

మకర సంక్రాంతి పండగను ఫ్యామిలీ అంతా కలిసి సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండగ రోజున రక రకాల సంప్రదాయ వంటకాలు, స్వీట్లు తయారు చేస్తారు. ఈ రోజు నువ్వులు, బెల్లంతో చేసిన ఆహార పదార్ధాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈ నేపధ్యంలో నువ్వులు, బెల్లం వేరు శనగతో ఇంట్లోనే రకరకాల స్వీట్స్ ను తయారు చేసుకోవచ్చు. ఈ రోజు వేరుశెనగ గజక్, నువ్వుల బెల్లం బర్ఫీ , బెల్లం ఖీర్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

Makar Sankranti 2025: మకర సంక్రాంతి రోజున నువ్వులు, వేరుశనగతో టేస్టీ టేస్టీ ఆహారాన్ని ఇంట్లోనే చేసుకోండి.. రెసిపీ మీ కోసం
Foods Recipe
Follow us on

మకర సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం జనవరి 14 న జరుపుకోనున్నారు. ఈ పండుగను భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ , కర్ణాటకలలో ఈ పండగను “సంక్రాంతి” లేదా మకర సంక్రాంతి అని పిలుస్తారు. అయితే ఉత్తర భారతదేశంలో దీనిని “ఖిచ్డీ” అని పిలుస్తారు. తమిళనాడులో దీనిని “పొంగల్” గా జరుపుకుంటారు. ఈశాన్య భారతదేశంలో దీనిని “బిహు” అని పిలుస్తారు. బెంగాల్‌లో ఈ పండగను “పౌష్ పర్వ లేదా గంగాసాగర్ మేళా” అని పిలుస్తారు.

ఈ పండుగ ముఖ్యంగా రైతులకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది పంటలు పండి ఇంటికి వచ్చే సమయం. ఈ రోజున ప్రజలు కొత్త పంట ఇంటికి వచ్చిన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ జరుపుకుంటారు. తమ సంతోషం కోసం దేవుడిని ప్రార్థిస్తారు. ముఖ్యంగా నువ్వులు, బెల్లం, కొత్త బియ్యాన్ని వినియోగిస్తారు. ఈ రోజున నువ్వులు, బెల్లంతో చాలా రుచికరమైన ఆహార వస్తువులను తయారు చేస్తారు. నువ్వులు బెల్లం లడ్డులు మకర సంక్రాంతి రోజున చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఈ ప్రత్యేక సందర్భంలో నువ్వులు, బెల్లంతో రుచికరమైన వస్తువులను తయారు చేసుకోవచ్చు.

నువ్వులు-బెల్లం బర్ఫీ

మకర సంక్రాంతి రోజు నువ్వులు, బెల్లం లడ్డూలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి పరిస్థితిలో నువ్వుల లడ్డూలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అంతేకాదు నువ్వులు, బెల్లంతో బర్బీని కూడా చేసుకోవచ్చు. దీని కోసం నువ్వులను శుభ్రంగా కడిగి వేయించి.. చల్లారిన తర్వాత గ్రైండర్‌లో వేసి పిండిగా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి వేడి ఎక్కిన తర్వాత బెల్లం పొడిని వేసి కొంచెం నీరు పోసి బెల్లం పాకం పాన్‌కు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు బెల్లం సిరప్కి నువ్వుల పొడి మిశ్రమాన్ని కలపాలి. కొంచెం ఉడికించాలి. దీని తరువాత తరిగిన డ్రై ఫ్రూట్స్ జోడించాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని వేయాలి. చల్లారిన తర్వాత కావలసిన ఆకారాల్లో కట్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

వేరుశెనగ గజక్

ఇంట్లో గజక్ తయారు చేయడం కూడా చాలా కష్టం కాదు. ఇది ఒక భారతీయ సాంప్రదాయ వంటకం. వేరుశెనగ గజక్ అనేది బెల్లం, వేరుశెనగ, జీడిపప్పు, బాదం మొదలైన వాటితో తయారు చేసే సాంప్రదాయ భారతీయ స్వీట్. తయారు చేయడానికి కావల్సిన వేరుశెనగ గుళ్ళను తీసుకుని వేయించి దానికి ఉన్న పొట్టు తీయాలి. పిండిగా చేయాలి. తరువాత పాన్లో నెయ్యి వేడి చేసి, అందులో బెల్లం పొడి వేసి.. కావాలంటే బెల్లంలో కొంచెం నీరు కూడా వేసుకోవచ్చు. ఈ బెల్లం సిరప్ అయ్యే వరకు స్పూన్ తో కదుపుతూ ఉండాలి. ఇప్పుడు బెల్లం పాకంలో శనగల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో నెయ్యి రాసి దానిపై ఈ పేస్ట్‌ను పోసి చల్లారనివ్వాలి. అంతే వేరుశెనగ గజాక్ సిద్ధంగా ఉంది.

బెల్లం పాయసం

బెల్లం ఖీర్ చేయడానికి.. ముందుగా బియ్యాన్ని నీటిలో 2 గంటలు నానబెట్టాలి. దీని తర్వాత బియ్యం నుంచి నీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాలు మరిగించడానికి ఒక పాత్రని పెట్టుకోవాలి. అందులో పాలు పోసి వేడి చెయ్యాలి. అప్పుడు పాలలో బియ్యం వేసి బాగా కలపాలి. పాత్రకు అంటుకోకుండా స్పూన్ తో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక పాత్రలో బెల్లం, అరకప్పు నీళ్ళు పోసి గ్యాస్ మీద పెట్టాలి. బెల్లం పూర్తిగా కరిగి సిరప్ సిద్ధంగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. తరిగిన డ్రై ఫ్రూట్స్‌ను ఖీర్‌లో వేసి.. ఖీర్ ఉడికిన తర్వాత, గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. దీని తరువాత ఖీర్‌లో బెల్లం సిరప్, కొంచెం నెయ్యి వేసి బాగా కలపాలి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..