వారానికి ఓసారి చిలకడ దుంప తింటే ఏం జరుగుతుందో తెలుసా?..ఈ భయంకరమైన సమస్య..!

|

Dec 12, 2023 | 8:11 AM

చిలగడదుంపను ప్రతిరోజూ తినడం వల్ల శరీరాన్ని కాలానుగుణ వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి చిలగడదుంప తీసుకోవడం ఎంతగానో ఉపకరిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉండడంతో పాటు ఆకలి వేయదు. ఇది అతిగా తినకుండా చేస్తుంది. బరువు తగ్గాలంటే స్వీట్‌పోటాటోను మీ ఆహారంలో చేర్చుకోండి.

వారానికి ఓసారి చిలకడ దుంప తింటే ఏం జరుగుతుందో తెలుసా?..ఈ భయంకరమైన సమస్య..!
Sweet Potato
Follow us on

చలికాలం మొదలైంది. ఉదయం, సాయంత్రం వేళలో తీవ్రమైన చలి, చల్ల గాలులు ప్రజల్ని వణికిస్తున్నాయి. ఇక నీళ్లైతే.. ఐస్‌ మాదిరిగానే చల్లబడిపోతున్నాయి. ఇలాంటి చలిలో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పైగా ఎక్కడ చూసిన చాలా మంది జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు సీజన్‌లో చాలా రకాల కూరగాయలు, పండ్లు మార్కెట్‌ నిండా కలకలలాడుతుంటాయి. ఏడాది పొడవునా ఎదురు చూసే కొన్ని రకాల పండ్లు, కూరగాయలు సైతం ఈ చలికాలంలోనే ఎక్కువగా లభిస్తాయి. అలాంటి వాటిలో బత్తాయి, సీతాఫలాలు, రేగుపండ్లు, చిలగడదుంప(స్వీట్‌పోటాటో) వంటి ముఖ్యమైనవి.. చిలగడదుంపలో ఫైబర్, ప్రోటీన్‌తో సహా అనేక పోషకాలు ఉన్నాయి. పొటాషియం, ఐరన్, వంటి విటమిన్లు ఎన్నో రోగాలను దరిచేరకుండా చేస్తాయి...స్వీట్‌పోటాటో.. తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

బలహీనమైన కంటి చూపును బలోపేతం చేయడంలో చిలగడదుంప చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది మెరుగైన కంటిచూపు, కంటి సంబంధిత వ్యాధులను నయం చేయడానికి సహాయపడుతుంది.

చిలగడదుంపలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. హైపర్‌టెన్సివ్ రోగులు తమ ఆహారంలో చిలగడదుంపలను చేర్చుకోవాలి.

ఇవి కూడా చదవండి

చిలగడదుంపలోని పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల గుండెపోటుతో సహా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

స్వీట్ పొటాటోలో ఐరన్, ఫోలేట్ మరియు విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే, చిలగడదుంపలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

చిలగడదుంప విటమిన్ సి మంచి మూలం. చిలగడదుంపను ప్రతిరోజూ తినడం వల్ల శరీరాన్ని కాలానుగుణ వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

ఊబకాయంతో బాధపడేవారికి చిలగడదుంప తీసుకోవడం ఎంతగానో ఉపకరిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉండడంతో పాటు ఆకలి వేయదు. ఇది అతిగా తినకుండా చేస్తుంది. బరువు తగ్గాలంటే స్వీట్‌పోటాటోను మీ ఆహారంలో చేర్చుకోండి.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..