
పెరుగు అంటే దాదాపు అందరికీ ఇష్టమే. చాలా మంది పెరుగన్నం తింటేనే భోజనం చేసినట్టుగా ఫీల్ అవుతుంటారు. ఎన్ని రకాల వంటకాలు ఉన్నప్పటికీ చివర్లో పెరుగన్నం తింటేనే సంతృప్తి కలుగుతుంది అనేవారు ఎక్కువగా ఉంటారు. ఇక మరికొందరు మజ్జిగ తాగుతారు. అయితే వేసవిలో పెరుగు తిపడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిఫుణులు చెబుతున్నారు. పెరుగులో శరీరానికి అవసరమైన క్యాల్షియంతో పాటు ఫాస్ఫరస్ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా పెరుగన్నం తినడం వల్ల ఎముకల సమస్యలతో పాటు దంతాల సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు.
వేసవిలో పెరుగన్నం తినటం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. పెరుగులో లభించే విటమిన్ బి12 నాడీ వ్యవస్థను కూడా మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇందులో విటమిన్ b2 కూడా ఉంటుంది ఇది శరీరంలోని శక్తిని ఉత్పత్తి చేసేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. రోజు సాయంత్రం పూట పెరుగన్నం తింటే శరీరానికి విటమిన్ బి3 తోపాటు పొటాషియం, మెగ్నీషియం లభించి కండరాలు దృఢంగా తయారవుతాయి. పెరుగన్నం రోజు తింటే శరీరం కూడా స్ట్రాంగ్ అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు, పొట్ట సమస్యలు కూడా రాకుండా ఉంటాయని చెబుతున్నారు.
అయితే, పెరుగన్న తయారీ కోసం తీసుకోవాల్సిన పదార్థాలు.. పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, తగినంత నూనె, ఉప్పు అవసరం. పెరుగన్నం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వండుకున్న అన్నాన్ని వేసి సరిపడా పెరుగును వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని అందులో తగినంత నూనె వేసి వేడెక్కిన తర్వాత పోపుదినుసులు, చిన్నగా తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత అందులోనే తగినంత అల్లం ముక్కలు, ఉప్పు వేసుకుని వేపుకొని పెరుగన్నం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, కమ్మటి పెరుగన్నం తినేందుకు తయారైనట్టే.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..