Potato Peel: ఆలు తొక్కలను బయట పడేస్తున్నారా ? ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

|

Nov 18, 2021 | 5:41 PM

బంగాళాదుంపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి బరువు పెంచడమే కాకుండా.. చెడు కొలెస్ట్రాల్‏ను తగ్గించడం.. సోడియం

Potato Peel: ఆలు తొక్కలను బయట పడేస్తున్నారా ? ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..
Potato Peel
Follow us on

బంగాళాదుంపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి బరువు పెంచడమే కాకుండా.. చెడు కొలెస్ట్రాల్‏ను తగ్గించడం.. సోడియం స్థాయిని నియంత్రించడంలో సహయపడతాయి. అయితే కేవలం బంగాళాదుంపలు మాత్రమే కాకుండా… వాటి తొక్కలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి తెలుసా.. ఆలు తొక్కలలో ఎన్నో పోషకాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలును అందిస్తాయి. బంగాళాదుంపల తొక్కలో పోటాషియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా.. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్ బీ3, పోషకాలు అధికంగా ఉంటాయి. ఆలు తొక్కలతో కలిగే ప్రయోజనాలెంటో ఇప్పుడు తెలుసుకుందామా.

బంగాళాదుంప తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా..అనేక వ్యాధులను తగ్గిస్తాయి. వీటిలో విటమిన్ బి కాంప్లెక్స్, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వలన క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి. ఆలు తొక్కలలో ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో అధిక మొత్తంలో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరాన్ని క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి బంగాళాదుంప తొక్కలు మేలు చేస్తాయి. వీటిని ఉడికించి తీసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ రక్తంలోని కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆలు తొక్కలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఇవే కాకుండా.. బంగాళాదుంప తొక్కలు ఎముకలను బలంగా మారుస్తాయి. ఇందులో ఉండే ఖనిజాలు ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి.

Also Read: Amala Paul: భారీ ప్రాజెక్ట్‏ను మిస్ చేసుకున్న అమలాపాల్ ? .. కారణమేంటంటే..

Tollywood Heroine: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా..?.. ఆ ఒక్క సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది

Health: రోజూ రన్నింగ్‌ చేస్తున్నారా.. అయితే మీ డైట్‌లో ఇవి కచ్చితంగా ఉండాల్సిందే..

Prickly Amaranth: కలుపు మొక్కగా భావించే ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు.. పాము విషాన్ని సైతం హరించే గుణం దీని సొంతం