Banana: అరటి మంచిదే.. కానీ ఈ సమయాల్లో తింటే మాత్రం డేంజర్

కొన్ని సందర్భాల్లో, సమయాల్లో అరటి పండును తీసుకోకపోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.  ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Banana: అరటి మంచిదే.. కానీ ఈ సమయాల్లో తింటే మాత్రం డేంజర్
Banana
Follow us

|

Updated on: Apr 04, 2022 | 9:41 AM

Health Tips: అరటి.. అందరికీ ఇష్టమైన ఫ్రూట్. తిన్న వెంటనే ఎనర్జీ ఇస్తుంది. ఫుడ్ సులువుగా జీర్ణం చేయడంలోనూ కీ రోల్ పోషిస్తుంది. అరటి పండ్లు చౌకగానే అన్ని ప్రాంతాలలో లభిస్తాయి. అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, పీచు మొదలైన పోషకాలు దండిగా ఉంటాయి. 100 గ్రాముల అరటి పండులో 258 మిల్లీగ్రాముల పొటాషియం, 2.6 గ్రాముల పీచు, 14 శాతం విటమిన్ సి, 20 శాతం విటమిన్ B6, 6 శాతం మెగ్నీషియంలోపాటు మాంగనీస్, రాగి, బయోటిన్ సమృద్ధిగా ఉంటాయి. పొద్దున్నే ఖాళీ కడుపున వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. తద్వారా డీహైడ్రేట్‌ అవుతారు… అలాగే శక్తినీ కోల్పోతారు. ఈ క్రమంలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందు అరటి పండు మంచి ఆప్షన్. దీనిని మార్నింగ్‌ డైట్‌(Morning Diet)లో చేర్చుకోవడం వల్ల మరింత ఉత్సాహంగా కసరత్తులు చేయవచ్చు. అదేవిధంగా సాయంత్రం పూట స్నాక్స్‌ రూపంలో అరటి పండ్లను తీసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో అరటి పండును తీసుకోకపోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.  ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • ఇతర పండ్లతో లేదా పాలతో కలిపి అరటి పండును తీసుకోకూడదు.
  • నైట్ సాధ్యమైనంతవరకు అరటి పండును తినకపోవడమే మేలు. అలా తీసుకోవడం వల్ల ఒక్కోసారి జలుబు లాంటి సమస్యలు దరిచేరే ఛాన్స్ ఉంది. రాత్రి అరటి పండు తినడం వల్ల శరీరంలో మ్యూకస్ తయారవుతుంది. ఇది శ్వాస కోశ సమస్యలకు కారణం అవుతుంది.
  • ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్న భోజనం తర్వాత కూడా అరటి పండును తినకూడదు.
  • చాలామంది పాలతో కలిపి అరటి పండును తీసుకుంటే, మరికొంతమంది పాలు తాగాక దీనిని తింటుంటారు. అయితే ఈ రెండు పద్ధతులూ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
  • ఈ పండులో మెగ్నీషియం, పొటాషియం, పీచు మొదలైన పోషకాలు ఉన్నా, పరగడుపున ఈ పండును తినడం శ్రేయస్కరం కాదు. ఆమ్లతత్త్వం కలిగిన అరటిపళ్లు పరగడుపున తింటే జీర్ణసంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Also Read: Ginger: అలెర్జీకి చెక్.. జలుబు మటుమాయం.. చిన్న అల్లం ముక్క తింటే ఇన్ని ఉపయోగాలా..!