సాధారణంగా మనం రోజూ చేసే పనులైనా కొన్నింటిని మర్చి పోతూ ఉంటాం. ఏదో ధ్యాసలో ఉండి స్టవ్ మీద కూరలు కూడా వదిలేయడం, నిరంతరం చేసే పనుల గురించి మర్చిపోవడం.. అయ్యో మర్చిపోయాం అని మళ్లీ చేయడం. దీన్ని మతి మరుపు అంటారు. ఇదే కంటిన్యూ అయితే మాత్రం అల్జీమర్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. రోజూ కాస్త జ్ఞాపక శక్తిని కోల్పోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మెమరీ అనేది ముఖ్యంగా చదివే పిల్లలకు చాలా ఇంపార్టెంట్ దీని వల్ల వారు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే కొన్ని రకాల ఫుడ్స్ ని తీసుకోవడం వల్ల ఈ మతిమరుపు నుంచి బయట పడవచ్చు. అంతే కాకుండా బ్రెయిన్ కూడా యాక్టీవ్ అవుతుంది. అదే విధంగా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బెర్రీస్ – ద్రాక్ష:
మన అందరికీ ఈజీగా లభ్యమయ్యే వాటిల్లో పండ్లలో బెర్రీస్, ద్రాక్షలు ముందు ఉంటాయి. బ్లూ బెర్రీ, స్ట్రా బెర్రీ, బ్లాక్ బెర్రీ, గ్రీన్ ద్రాక్ష, రెడ్ ద్రాక్ష, బ్లాక్ ద్రాక్ష, కమలా పండు వంటి జాతికి సంబంధించిన పండ్లను తినడం వల్ల మెమరీ పెరుగుతుంది. అంతే కాకుండా వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ పనితీరును మెరుగు పరుస్తుంది. దీని కారణంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
క్యాబేజ్ జాతికి చెందినవి:
క్యాబేజ్, క్యాలీ ఫ్లవర్, బ్రోకలీ వంటి వాటిల్లో లభ్యమయ్యే అన్ని రకాలను తీసుకోవచ్చు. పలు రకాల ఇన్ ఫెక్షన్లు, వైరస్ లు, వ్యాధులు దరి చేరకుండా క్యాబేజ్ మనల్ని రక్షిస్తుంది. అంతే కాకుండా వీటిల్లో పలు విటమిన్లు, మినరల్స్, పోషకాలు, ఫ్లేవ నాయిడ్స్ ఉంటాయి. వీటి కారణంగా మెదడు చురుకుగా పని చేస్తుంది. దీని కారణంగా మతి మరపు దరి చేరనివ్వదు.
నట్స్:
నట్స్ తినడం వల్ల జ్ఞాపక శక్తి అనేది పెరగడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు. నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, విటమిన్లు, మినరల్స్, మెగ్నీషఇయం, ఓమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజూ నట్స్ తినడం వల్ల మెమరీ అనేది పెరుగుతుంది. బ్రెయిన్ కూడా యాక్టీవ్ అవుతుంది.
తేనె:
మెమరీని పెంచే వాటిల్లో తేనె కూడా ఒకటి. ప్రతి రోజు తేనె తీసుకోవడం వల్ల మెదడును చురుగ్గా మార్చి, బ్రెయిన్ ఆరోగ్యాన్ని పెంచుతుంది. డిప్రెషన్, ఒత్తిడి వంటి వాటిని కూడా తగ్గించుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.