Tiyyati Bellam Bajjilu: తియ్యటి బెల్లం బజ్జీలు.. పిల్లలు ఇష్టపడి మరీ తింటారు..

బజ్జీలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. అందులోనూ పిల్లలు మరింత ఇష్టపడి మరీ తింటారు. అయితే వీటిని ఆరోగ్యంగా కూడా తినవచ్చు. గోధుమ పిండి, బెల్లం కలిపి కమ్మగా ఉండే బజ్జీలు వేసుకోవచ్చు. ఇందులో మైదా వాడం కాబట్టి.. పిల్లలకు ఎంతో మంచిది. వీటిని ఎప్పుడైనా.. వేసుకోవచ్చు. స్నాక్‌గా కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తినడం కూడా మంచిదే. మరి ఇలాంటి తియ్యటి బెల్లం బజ్జీలను..

Tiyyati Bellam Bajjilu: తియ్యటి బెల్లం బజ్జీలు.. పిల్లలు ఇష్టపడి మరీ తింటారు..
Tiyyati Bellam Bajjilu

Edited By:

Updated on: Sep 21, 2024 | 10:06 PM

బజ్జీలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. అందులోనూ పిల్లలు మరింత ఇష్టపడి మరీ తింటారు. అయితే వీటిని ఆరోగ్యంగా కూడా తినవచ్చు. గోధుమ పిండి, బెల్లం కలిపి కమ్మగా ఉండే బజ్జీలు వేసుకోవచ్చు. ఇందులో మైదా వాడం కాబట్టి.. పిల్లలకు ఎంతో మంచిది. వీటిని ఎప్పుడైనా.. వేసుకోవచ్చు. స్నాక్‌గా కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తినడం కూడా మంచిదే. మరి ఇలాంటి తియ్యటి బెల్లం బజ్జీలను ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గోధుమ పిండి బెల్లం బజ్జీలకి కావాల్సిన పదార్థాలు:

గోధుమ పిండి, బెల్లం, సన్నం రవ్వ, నెయ్యి, వంట సోడా, యాలకుల పొడి, ఆయిల్.

ఇవి కూడా చదవండి

గోధుమ పిండి బెల్లం బజ్జీలు తయారీ విధానం:

ముందుగా బెల్లాన్ని బాగా తురుముకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు వేస్తే.. మొత్తం బెల్లం కరుగుతుంది. దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. మొత్తం బెల్లం కరిగాక.. దీన్ని వడ కట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో సరిపడా గోధుమ పిండి, వంట సోడా, నెయ్యి, యాలకుల పొడి వేసి మొత్తం కలుపుకోవాలి. కావాల్సినంత నీళ్లు కూడా వేసుకోవచ్చు. ఉండలు లేకుండా చేతితో చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండితో బజ్జీలు వేసుకోవచ్చు. వీటిని బాగా వేయించాక.. సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బజ్జీలు సిద్ధం. వీటిని నేరుగా తినేయవచ్చు.