Senaga Pindi Charu: శనగపిండితో చారు.. వేటితో అయినా సూపర్ అంతే!

|

Nov 04, 2024 | 7:50 PM

శనగ పిండితో చేసే వంటలు చాలా రుచిగా ఉంటాయి. శనగ పిండితో ఎక్కువగా పకోడీలు, బజ్జీలు వంటివి చేస్తారు. కానీ శనగ పిండితో చారు కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన కూరగాయలు వేసి చారులా చేసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని చపాతీ, అన్నంలో తిన్నా చాలా బాగుంటుంది.

Senaga Pindi Charu: శనగపిండితో చారు.. వేటితో అయినా సూపర్ అంతే!
Senaga Pindi Charu
Follow us on

శనగపిండి అనగానే చాలా మందికి బజ్జీలు, పకోడీలు గుర్తుకు వస్తాయి. శనగపిండితో అనేక రకాల స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏవి చేసినా చాలా రుచిగా ఉంటాయి. శనగ పిండి తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే. ఇలా శనగ పిండితో చేసే రెసిపీల్లో శనగ పిండి చారు కూడా ఒకటి. ఇప్పుడంటే ఈ రెసిపీ ఎవరూ చేయడం లేదు. కానీ పూర్వం ఈ వంటను ఎక్కువగా చేసేవారట. ఇది చాలా త్వరగా అయిపోవడమే కాకుండా.. రుచి కూడా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నా, చపాతీల్లోకి అయినా బాగుంటుంది. చిన్న పిల్లలకు పెట్టడం వల్ల అరుగుదల సమస్యలు తగ్గుతాయి. కార్తీక మాసంలో ఈ రెసిపీ బెస్ట్ అని చెప్పొచ్చు. మరి ఈ శనగ పిండితో చారు ఎలా చేస్తారు? ఇందుకు కావాల్సి పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

శనగపిండి చారుకి కావాల్సిన పదార్థాలు:

శనగ పిండి, పెరుగు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, తాళింపు దినుసులు, పసుపు, కారం, ఉప్పు, టమాటా, వంకాయ, బీన్స్, బెండకాయ, కొద్దిగా నెయ్యి, నిమ్మరసం, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్.

శనగపిండి చారు తయారీ విధానం:

ముందుగా శనగ పిండిలో కొద్దిగా పెరుగు వేసి మిక్స్ చేసి.. ఉండలు లేకుండా నీళ్లు వేసి కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడెక్కా.. తాళింపు దినుసులు కరివేపాకు, ఎండు మిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చి మిర్చి వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసిన తర్వాత.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే దాకా వేయించాలి. ఇప్పుడు వంకాయ, టమాటా, బెండకాయలు వేసి బాగా ఫ్రై చేయాలి.

ఇవి కూడా చదవండి

ఇవి బాగా వేగిన కారం, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి వేయించి.. నీళ్లు వేయాలి. ముక్కలు ఉడికాక.. ముందుగా కలిపి పెట్టిన శనగ పిండి మిశ్రమం వేసి ఉడికించాలి. ఓ ఐదు నిమిషాలు ఉడికించాక కొత్తిమీర, గరం మసాలా వేసి కలిపి ఓ ఉడుకు రానిచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే శనగ పిండి చారు సిద్ధం. ఇది చాలా రుచిగా ఉంటుంది. పులుపు కావాలి అనుకునేవారు ఇందులో నిమ్మకాయ రసం పిండుకోవచ్చు.