Spicy Pudina Chutney: పుదీనా టమాటా చట్నీ ఇలా చేయండి.. వేడివేడి అన్నంలోకి సూపర్ అంతే..

| Edited By: Ravi Kiran

Aug 03, 2024 | 10:45 PM

పుదీనా, టమాటా ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా మంది పుదీనాని కేవలం బిర్యానీ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. పుదీనాతో చట్నీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి. అందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. కేవలం అన్నంలోకి మాత్రమే కాకుండా.. అన్ని రకాల టిఫిన్స్‌లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మిగతా పచ్చడితో పోలిస్తే..

Spicy Pudina Chutney: పుదీనా టమాటా చట్నీ ఇలా చేయండి.. వేడివేడి అన్నంలోకి సూపర్ అంతే..
Pudina Tomato Chutney
Follow us on

పుదీనా, టమాటా ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా మంది పుదీనాని కేవలం బిర్యానీ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. పుదీనాతో చట్నీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి. అందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. కేవలం అన్నంలోకి మాత్రమే కాకుండా.. అన్ని రకాల టిఫిన్స్‌లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మిగతా పచ్చడితో పోలిస్తే.. ఇది కొత్త రుచిని అందిస్తుంది. మరి ఈ టేస్టీ అండ్ స్పైసీ పుదీనా చట్నీ మరి ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

స్పైసీ పుదీనా టమాటా చట్నీకి కావాల్సిన పదార్థాలు:

పుదీనా, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, చింత పండు, ఉప్పు, తాళింపు దినుసులు, కరివేపాకు, ఆయిల్.

పుదీనా టమాటా చట్నీ తయారీ విధానం:

ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి.. ఆయిల్ వేయండి. ఆ తర్వాత పచ్చి మిర్చి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త రంగు మారాక.. టమాటాలను కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకు వేయించాలి. ఆ నెక్ట్స్ పుదీనా వేసి ఓ 20 సెకన్లు పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది బాగా చల్లారాక.. ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేయాలి. కొద్దిగా చింత పండు వేసి బాగా రుబ్బుకోవాలి. అవసరం అయితే వాటర్ వేసుకోవచ్చు. ఇది కాస్త కచ్చా పచ్చాగా అయినా చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు వేయించిన కడాయిలోనే ఆయిల్ వేసి.. వెల్లుల్లి, తాళింపు దినుసులు, కరివేపాకు, ఎండు మిర్చి వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. తాళింపు కాస్త చల్లారాక.. మిక్సీ పట్టిన మిశ్రమంలో వేసి కలపాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పుదీనా టమాటా చట్నీ సిద్ధం. వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి, ఈ పచ్చడి వేసుకుని తింటే ఆహా అంటారు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది.