Onion Kachori: బేకరీల్లో లభించే ఆనియన్ కచోరిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చిలా!

| Edited By: Ravi Kiran

Mar 03, 2024 | 11:45 PM

సాయంత్రం అయ్యింది చాలా మంది రోడ్ సైడ్ బండ్ల వద్దే కనిపిస్తారు. టీ తాగుతూ స్నాక్స్ తింటూ కాస్త రిలాక్స్ అవుతారు. మైండ్‌ని కూడా రీఫ్రెష్ చేసుకుంటారు. సాధారణంగా తినే చిరు తిళ్లల్లో ఆనియన్ కచోరి కూడా ఒకటి. ఆనియన్ కచోరి కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ఆనియన్ కచోరీని ఇంట్లో కూడా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. తయారు చేయడం కూడా సులభమే. స్పెషల్ డేస్‌లో, వీకెండ్స్‌లో స్పెషల్‌గా తయారు చేసి ఇంట్లో వాళ్లకు..

Onion Kachori: బేకరీల్లో లభించే ఆనియన్ కచోరిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చిలా!
Onion Kachori
Follow us on

సాయంత్రం అయ్యింది చాలా మంది రోడ్ సైడ్ బండ్ల వద్దే కనిపిస్తారు. టీ తాగుతూ స్నాక్స్ తింటూ కాస్త రిలాక్స్ అవుతారు. మైండ్‌ని కూడా రీఫ్రెష్ చేసుకుంటారు. సాధారణంగా తినే చిరు తిళ్లల్లో ఆనియన్ కచోరి కూడా ఒకటి. ఆనియన్ కచోరి కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ఆనియన్ కచోరీని ఇంట్లో కూడా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. తయారు చేయడం కూడా సులభమే. స్పెషల్ డేస్‌లో, వీకెండ్స్‌లో స్పెషల్‌గా తయారు చేసి ఇంట్లో వాళ్లకు హెల్దీగా అందించవచ్చు. మరి ఈ ఆనియన్ కచోరి ఎలా తయారు చేస్తారు? తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆనియన్ కచోరి తయారీకి కావాల్సిన పదార్థాలు:

మైదా పిండి, అటుకులు, వాము, ఉల్లి పాయ ముక్కలు, పచ్చి మిర్చి, నెయ్యి, ఆయిల్, ఉప్పు, కొత్తి మీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, దనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మ రసం.

ఆనియన్ కచోరి తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి తీసుకోవాలి. తర్వాత ఇందులో వాము, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుంటూ.. పిండిని కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టి కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని.. అందులో అటుకులు, వాము, ఉల్లి పాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన పచ్చి మిర్చి, ఉప్పు, కొత్తి మీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మ రసం వేసి అన్నీ కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరో చిన్న గిన్నెలో కొద్దిగా నెయ్యి , మైదా పిండి వేసి బాగా కలుపుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత పక్కన పెట్టిన మైదా పిండి తీసుకుని సమానంగా ఉండలుగా చేసుకోవాలి. వీటిని చపాతీల్లా చేసి.. పక్కన పెట్టాలి. ఇప్పుడు ముందుగా ఒక చపాతీ తీసుకుని దానిపై నెయ్యి మైదా పిండి మిశ్రమాన్ని రాయాలి. ఇలా అన్నింటిపై నెయ్యి మిశ్రమం రాసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఒక్కో చపాతీని మళ్లీ రోల్ చేస్తూ.. సాగదీయాలి. ఇప్పుడు దీన్ని కచోరి పరిమాణంలో ఒత్తుకుని.. దానిపై ఉల్లిపాయల మిశ్రమం పెట్టి అంచులను మూసి వేయాలి. ఈలోపు ఆయిల్ వేడి చేసి పెట్టుకోవాలి. ఇందులో కచోరీలను వేసి.. బాగా వేయించుకుని తీసేయాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ కచోరి సిద్ధం. వీటిని సాస్‌తో, మైనీస్‌తో కూడా తినొచ్చు.