Mutton Gongura: రుచికరమైన మటన్ గోంగూర.. వేడి అన్నంలోకి అదుర్స్ అంతే!

| Edited By: Ram Naramaneni

Dec 12, 2024 | 9:36 PM

మటన్‌తో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. మటన్‌తో గోంగూర కలిపి వండితే మరింత రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే.. ఆహా మాటలు ఉండవు. అంత రుచిగా ఉంటుంది..

Mutton Gongura: రుచికరమైన మటన్ గోంగూర.. వేడి అన్నంలోకి అదుర్స్ అంతే!
Mutton Gongura
Follow us on

నాన్ వెజ్‌లో మటన్.. ఓ స్పెషల్ అని చెప్పాలి. నాన్ వెజ్ భోజనాలు పెట్టారంటే ఖచ్చితంగా మటన్ ఉండాల్సిందే. మటన్ చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. కానీ మితంగా తీసుకోవాలి. మటన్‌తో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. మటన్‌తో గోంగూర కలిపి వండితే మరింత రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే.. ఆహా మాటలు ఉండవు. అంత రుచిగా ఉంటుంది. ఈ కర్రీ తయారీ విధానం చాలా సింపుల్. మరి ఈ మటన్ గోంగూర కర్రీ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన విధానాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గోంగూర మటన్‌కి కావాల్సిన పదార్థాలు:

మటన్, గోంగూర, ఉల్లిపాయాలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర.

గోంగూర మటన్‌ తయారీ విధానం:

ముందుగా మటన్‌ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దీన్ని కుక్కర్‌లోకి తీసుకుని ఇందులో కొద్దిగా నూనె, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, నీళ్లు వేసి కనీసం ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఈలోపు మరో పాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కాక.. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వేయించాలి. ఇవి వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి కాసేపు వేయించి.. ఆ తర్వాత గోంగూర వేసి అంతా కలిపి మీడియం మంట మీద మూత పెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.

ఇవి కూడా చదవండి

గోంగూర బాగా వేగాక.. వేడి చల్లారిన మటన్ కూడా వేసి కలిపి ఉడికించాలి. ముక్క ఉడికిందో లేదో చూసి.. కావాలంటే కొద్దిగా నీళ్లు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. దించే ముందు గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర వేసి కాసేపు ఉడకనిచ్చి దించేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే గోంగూర మటన్ సిద్ధం. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ అదుర్స్. ఈ చలి కాలంలో ఈ కూర తినడం ఆరోగ్యానికి కూడా మంచిది.