Mangalore Fish Curry: మంగళూరు స్టైల్ చేపల కూర.. తిన్నారంటే మళ్లీ ఇలాగే చేయమంటారు..

| Edited By: Ravi Kiran

Aug 31, 2024 | 9:26 PM

చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. చికెన్, మటన్‌ల కంటే చేపలు హెల్త్‌కి చాలా మంచిది. చేపల్లో ఆరోగ్యకరమైన పోషకాలు చాలా ఉంటాయి. చేపలతో చేసే ఫ్రై, పులుసు ఎంతో రుచిగా ఉంటుంది. ముఖ్యంగా చేపల పులుసును వివిధ ప్రాంతాల బట్టి తయారు చేస్తూ ఉంటారు. ఒక్కో స్టైల్‌లో ఒక్కోలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇవి ఎంతో డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం మంగళూరు స్టైల్‌లో చేపల పులుసు గురించి..

Mangalore Fish Curry: మంగళూరు స్టైల్ చేపల కూర.. తిన్నారంటే మళ్లీ ఇలాగే చేయమంటారు..
Mangalore Fish Curry
Follow us on

చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. చికెన్, మటన్‌ల కంటే చేపలు హెల్త్‌కి చాలా మంచిది. చేపల్లో ఆరోగ్యకరమైన పోషకాలు చాలా ఉంటాయి. చేపలతో చేసే ఫ్రై, పులుసు ఎంతో రుచిగా ఉంటుంది. ముఖ్యంగా చేపల పులుసును వివిధ ప్రాంతాల బట్టి తయారు చేస్తూ ఉంటారు. ఒక్కో స్టైల్‌లో ఒక్కోలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇవి ఎంతో డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం మంగళూరు స్టైల్‌లో చేపల పులుసు గురించి తెలుసుకోబోతున్నాం. మంగళూరు చేపల పులుసు ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ తినాలని అనిపిస్తుంది.మరి ఈ ఫిష్ కర్రీకి ఎలాంటి పదార్థాలు కావాలి? ఎలా తయారు చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం.

చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు:

చేపలు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కొబ్బరి పాలు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్ర, చింత పండు, కొబ్బరి తురుము, ఆయిల్, కొత్తిమీర.

చేపల పులుసు తయారీ విధానం:

ముందుగా మనం మిక్సీ తీసుకుని అందులో ధనియాలు, ఎండు మిర్చి, జీలకర్ర, కొబ్బరి తురుము, పసుపు, నానబెట్టిన చింత పండు వేసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇందులో ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు వేసి రంగు మారేంత వరకూ వేయించు కోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఇది వేగా.. మీక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలాక.. కొబ్బరి పాలు వేసి ఇగురులా ఉడికించాలి. పులుసులా కావాలి అంటే.. వాటర్ వేసి పులుసులా ఉడికించాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత కారం, ఉప్పు వేసి బాగా కలిపి.. శుభ్రంగా కడిగిన చేప ముక్కలు వేసి మీడియం మంట మీద ఓ పావు గంట సేపు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి దించుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మంగళూరు స్టైల్ చేపల పులుసు సిద్ధం. ఇది ఆరోగ్యం కూడా. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది.