Dondakaya Ulli Karam: దొండకాయతో ఇలా ఉల్లి కారం చేయండి.. నోట్లే వేస్తే కరిగిపోతుంది..

| Edited By: Ram Naramaneni

Dec 22, 2024 | 9:34 PM

దొండకాయలు అంటే చాలా మందికి పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఇలా ఒక్కసారి దొండకాయలతో ఉల్లికారం చేసి పెట్టండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. కమ్మగా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని అన్నం, చపాతీ, రోటీ, పుల్కలతో తిన్నా బాగుంటుంది. ఒక్కసారి చేశారంటే ఎప్పుడూ ఇలాగే చేసుకుంటారు. లంచ్ బాక్సుల్లోకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు..

Dondakaya Ulli Karam: దొండకాయతో ఇలా ఉల్లి కారం చేయండి.. నోట్లే వేస్తే కరిగిపోతుంది..
Dondakaya Ulli Karam
Follow us on

దొండకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు లభిస్తూ ఉంటాయి. దొండకాయలు అంటే చాలా మందికి పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఇలా ఒక్కసారి దొండకాయలతో ఉల్లికారం చేసి పెట్టండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. కమ్మగా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని అన్నం, చపాతీ, రోటీ, పుల్కలతో తిన్నా బాగుంటుంది. ఒక్కసారి చేశారంటే ఎప్పుడూ ఇలాగే చేసుకుంటారు. లంచ్ బాక్సుల్లోకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఈ రెసిపీ కూడా చాలా త్వరగా అయిపోతుంది. దొండకాయలు ఇష్ట పడేవారు కూడా ఈ రెసిపీని మిస్ చేయకుండా చేసుకోండి. మరి దొండకాయ ఉల్లి కారానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

దొండకాయ ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలు:

దొండకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, కారం, పసుపు, ఉప్పు, ఎండు మిర్చి, మెంతులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, చింత పండు, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, నెయ్యి.

దొండకాయ ఉల్లికారం తయారీ విధానం:

ముందుగా దొండకాయను శుభ్రంగా ఉప్పు వేసి కడిగిన తర్వాత రెండు వైపుల సన్నగా గాట్లు పెట్టండి. ఇప్పుడు ఓ కడాయిలో ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి దొండకాయలను ముందుగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగే లోపు మరో కడాయి పెట్టి.. అందులో కొద్దిగా ఎండు మిర్చి, మెంతులు, ధనియాలు, జీలకర్ర ఒకదాని తర్వాత వేసి మరొకటి వేయించుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీలోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి, నానబెట్టిన చింత పండు కొద్దిగా వేసి మెత్తగా పేస్ట్ అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయలు వేగాక తీసి పక్కన పెట్టాలి. ఇందులో మరికొద్దిగా నెయ్యి లేదా ఆయిల్ వేసి వేడి చేసి.. ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించి.. ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి.

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసి చిన్న మంట మీద అంతా ఆయిల్‌లో ఫ్రై చేయాలి. ఇది కూడా ఫ్రై అయ్యాక వేయించిన దొండకాయలు కూడా వేసి చిన్న మంట మీదనే ఓ పావు గంట సేపు ఉడికించు కోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆయిల్ పైకి తేలాక కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఉల్లి కారం సిద్ధం.