Chicken Tikka: రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..

|

Dec 27, 2024 | 8:50 PM

చికెన్‌తో ఎక్కువగా స్నాక్స్, స్టాటర్స్ తినడానికి ఇష్ట పడుతూ ఉంటారు. రెస్టారెంట్లకు వెళ్లినా ముందుగా స్టాటర్స్ ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఇలా ఎక్కువగా ఆర్డర్ చేసే వటిల్లో చికెన్ టిక్కా కూడా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్‌లో చేసే ఈ టిక్కా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు..

Chicken Tikka: రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
Chicken Tikka
Follow us on

నాన్ వెజ్ అంటే చాలా మంది పడి పడి మరీ తింటారు. అందులోనూ చికెన్‌కి ఫ్యాన్స్ ఎక్కువే. చికెన్‌తో చేసే ఎలాంటి వంటలు అయినా చాలా రుచిగా ఉంటాయి. చికెన్‌తో ఎక్కువగా స్నాక్స్, స్టాటర్స్ తినడానికి ఇష్ట పడుతూ ఉంటారు. రెస్టారెంట్లకు వెళ్లినా ముందుగా స్టాటర్స్ ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఇలా ఎక్కువగా ఆర్డర్ చేసే వటిల్లో చికెన్ టిక్కా కూడా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్‌లో చేసే ఈ టిక్కా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కాస్త సమయం పెడితే చాలు. ఇంట్లో ఆరోగ్యంగా చేసుకుని తినవచ్చు. మరి ఈ చికెన్ టిక్కా ఎలా తయారు చేస్తారు? ఈ చికెన్ టిక్కాకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చికెన్ టిక్కాకు కావాల్సిన పదార్థాలు:

బోన్‌లోస్ చికెన్, పెరుగు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మరసం, ధనియాల పొడి, కసూరి మేథీ, బిర్యానీ మసాలా, మిరియాల పొడి, శనగ పిండి, ఆయిల్.

చికెన్ టిక్కా తయారీ విధానం:

చాలా సింపుల్‌గా మనం ఈ చికెన్ టిక్కా తయారు చేసుకోవచ్చు. మ్యారినేట్ కరెక్ట్‌గా చేస్తే చికెన్ టిక్కా చాలా మరింత రుచిగా వస్తుంది. ముందుగా చికెన్‌ని శుభ్రంగా క్లీన్ చేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో పెరుగు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మరసం, ధనియాల పొడి, కసూరి మేథీ, బిర్యానీ మసాలా, మిరియాల పొడి, శనగ పిండి అన్నీ వేసి బాగా కలిపి ఓ గంట పాటు పక్కన పెట్టుకోండి. సమయం ఉంటే ముందు రోజు రాత్రే మ్యారినేట్ చేసుకుంటే.. ఉదయానికి మరింత రుచిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

చికెన్‌ టిక్కాకు, కబాబ్స్‌కి మ్యారినేషన్ చాలా ముఖ్యం. ఫ్రిజ్ ఉంటుంది కాబట్టి అందులో స్టోర్ చేసుకోవచ్చు. తినే ముందు ఇనుమ చువ్వలను తీసుకుని దానికి చికెన్ ముక్కలను గుచ్చండి. కట్టెల పొయ్యి బొగ్గుల మీద చేస్తే మరింత రుచిగా ఉంటాయి. స్టవ్ అయితే దానిపై ప్యాన్ పెట్టి.. కొద్దిగా ఆయిల్ రాయండి. దానిపై ఈ చికెన్ ముక్కలను పెట్టి.. అన్ని వైపులా కుక్ అయ్యేలా చిన్న మంట మీద ఉడికించుకోండి. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ టిక్కా సిద్ధం.