Bread Rasgulla: బ్రెడ్‌తో రసగుల్లాలు.. టేస్ట్ అదిరి పోవాల్సిందే..

| Edited By: Ram Naramaneni

Aug 08, 2024 | 10:05 PM

బ్రెడ్‌తో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో ఎక్కువగా స్నాన్స్ ఉంటాయి. బ్రెడ్‌తో ఎలాంటి వెరైటీలు తయారు చేసినా.. ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మంది ఇష్ట పడి మరీ తింటూ ఉంటారు. బ్రెడ్‌‌తో చాలా మంది శాండ్ విచ్‌లు, టోస్ట్ చేసేందుకు బ్రెడ్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంట్లో ఒక్కోసారి బ్రెడ్ మిగిలిపోతూ ఉంటుంది. దాన్ని చాలా మంది పడేస్తూ ఉంటారు. ఇలా మిగిలి పోయిన బ్రెడ్‌తో రసగుల్లాలు..

Bread Rasgulla: బ్రెడ్‌తో రసగుల్లాలు.. టేస్ట్ అదిరి పోవాల్సిందే..
Bread Rasgulla
Follow us on

బ్రెడ్‌తో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో ఎక్కువగా స్నాన్స్ ఉంటాయి. బ్రెడ్‌తో ఎలాంటి వెరైటీలు తయారు చేసినా.. ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మంది ఇష్ట పడి మరీ తింటూ ఉంటారు. బ్రెడ్‌‌తో చాలా మంది శాండ్ విచ్‌లు, టోస్ట్ చేసేందుకు బ్రెడ్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంట్లో ఒక్కోసారి బ్రెడ్ మిగిలిపోతూ ఉంటుంది. దాన్ని చాలా మంది పడేస్తూ ఉంటారు. ఇలా మిగిలి పోయిన బ్రెడ్‌తో రసగుల్లాలు తయారు చేయవచ్చని మీకు తెలుసా? బ్రెడ్‌తో రసగుల్లాలు చేయడం చాలా సులభం కూడా. తక్కువ సమయంలోనే ఇవి ప్రిపేర్ చేయవచ్చు. మరి బ్రెడ్‌తో ఈ రసగుల్లాలు ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్‌ రసగుల్లాలకి కావాల్సిన పదార్థాలు:

బ్రెడ్, మిల్క్, పంచదార, యాలకుల పొడి, నిమ్మ రసం, నట్స్.

బ్రెడ్‌ రసగుల్లాల తయారీ విధానం:

ముందుగా బ్రెడ్ ముక్కల అంచులను కట్ చేసి.. చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో పాలు పోసి మరిగించాలి. పాలు మరిగాక.. నిమ్మరసం పిండి పాలను విరగ్గొట్టాలి. వెనిగర్ అయినా ఉపయోగించవచ్చు. పాలు విరిగాక వడకట్టి పన్నీర్ మిశ్రమాన్ని వేరు చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు పన్నీర్‌ తీసి పక్కన పెట్టాలి. ఇందులో బ్రెడ్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా కలిపాక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమంతో చిన్న చిన్న లడ్డూలు చుట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత రసగుల్లా సిరప్ తయారు చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని అందులో నీళ్లు, పంచదార వేసి మరిగించాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేయాలి. పంచదార సిరప్ బాగా మరిగాక.. ఇందులో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న లడ్డూలు వేసి ఓ పావు గంట సేపు ఉడికించాలి. ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రసగుల్లాలు సిద్ధం. కావాలి అంటే వీటిని ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగా కూడా తినవచ్చు.