Gongura Tomato Chutney: గోంగూర టమాటా పచ్చడి.. వేడి అన్నంలోకి వేసుకుని తింటే.. స్వర్గమే!

చలి కాలంలో సరిగ్గా అన్నం తినాలని అనిపించదు. అలాంటప్పుడు వేడి వేడి అన్నంలోకి పచ్చళ్లు వేసుకుని తింటే.. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడూ ఒకే రకమైన పచ్చళ్లు కాకుండా.. ఇలా వెరైటీగా ట్రై చేయవచ్చు. ఇప్పటివరకూ మనం చాలా రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్ గా గోంగూర టమాటా నిల్వ పచ్చడి గురించి కూడా తెలుసుకుందాం. ఈ పచ్చడి ఎంతో కమ్మగా ఉంటుంది. తయారు చేయడం కూడా సులభమే. తక్కువ సమయంలోనే..

Gongura Tomato Chutney: గోంగూర టమాటా పచ్చడి.. వేడి అన్నంలోకి వేసుకుని తింటే.. స్వర్గమే!
Gongura Tomato Chutney

Edited By: Ram Naramaneni

Updated on: Dec 28, 2023 | 9:18 PM

చలి కాలంలో సరిగ్గా అన్నం తినాలని అనిపించదు. అలాంటప్పుడు వేడి వేడి అన్నంలోకి పచ్చళ్లు వేసుకుని తింటే.. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడూ ఒకే రకమైన పచ్చళ్లు కాకుండా.. ఇలా వెరైటీగా ట్రై చేయవచ్చు. ఇప్పటివరకూ మనం చాలా రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్ గా గోంగూర టమాటా నిల్వ పచ్చడి గురించి కూడా తెలుసుకుందాం. ఈ పచ్చడి ఎంతో కమ్మగా ఉంటుంది. తయారు చేయడం కూడా సులభమే. తక్కువ సమయంలోనే రుచిగా ఉండే టమాటా పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే గోంగూర టమాట పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి? పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గోంగూర టమాట నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు:

గోంగూర, టమాటాలు, మెంతులు, జీలకర్ర, ఎండు మిర్చి, ఉప్పు, ఆయిల్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ, తాళింపు సరుకులు.

ఇవి కూడా చదవండి

గోంగూర టమాట నిల్వ పచ్చడి తయారీ విధానం:

ముందుగా ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కాక.. మెంతులు, జీలకర్ర వేసి వేయించు కోవాలి. ఇవి వేగాక ఎండు మిర్చి కూడా వేసి వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసి చల్లార్చుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లోకి వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. నెక్ట్స్ గోంగూరను కూడా శుభ్రంగా కడిగేసి.. తడి లేకుండా ఆర బెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి.. తరిగిన టమాట ముక్కలు, గోంగూర కలిపి వేసి.. మెత్తగా ఆయిల్ పైకి తేలేంత వరకూ వేయించాలి. ఆ తర్వాత వీటిని చల్లార్చి.. మిక్సీ జార్ లోకి వేసి ఒక్కసారి తిప్పితే సరిపోతుంది. ఆ తర్వాత ఈ పచ్చడికి తాళింపు వేసుకోవడమే. ఇలా తయారు చేసిన టమాట పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. టిఫిన్స్ లోకి కూడా బావుంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది.