ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ డయాబెటీస్ బారిన పడుతున్నారు. డయాబెటీస్ ఉన్నవారు ఏం తినాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే బ్లడ్‌లో షుగర్ లెవల్స్ అనేవి ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీంతో మళ్లీ అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇలాంటి డయాబెటిక్ పేషెంట్లకు ప్రత్యేకంగా బ్రేక్ ఫాస్ట్ రెసిపీలు ఉన్నాయి. వాటిల్లో సోయా దోశ ఒకటి. ఈ దోశలు తినడం వల్ల ఎనర్జీతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం. అంతే కాకుండా షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. డయాబెటీస్ పేషెంట్లు ఎప్పుడూ ఒకేసారి తనకూడదు. దీని వల్ల షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండాలి. మరి ఈ సోయా దోశ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సోయా పాలు, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, గోధుమ పిండి, బేకింగ్ సోడా, జీలకర్ర, ఉప్పు, ఆయిల్.
ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇందులో గోధుమ పిండి, సోయా పాలు వేసి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఇందులో పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, గోధుమ పిండి, బేకింగ్ సోడా, జీలకర్ర, ఉప్పు, వాటర్ వేసి దోశ బాటర్‌లలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఓ పావు గంట సేపు పక్కన ఉంచాలి. ఇప్పుడు పెనం పెట్టి.. ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. పెనం వేడెక్కాక దోశలు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి.. రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే సోయా దోశ సిద్ధం. ఈ దోశలను కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, పప్పు చట్నీ, సాంబార్, కర్రీస్ ఇలా వేటితో అయినా తినవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.