నవంబర్ 2వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. కార్తీక మాసం వచ్చిందంటే చాలా మంది.. ఒక నెల మొత్తం నాన్ వెజ్ తినకుండా ఆ కైలాస నాథుడికి పూజలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎప్పుడూ చేసుకునే వంటలకు బదులు ఇలా కొత్తగా, రుచిగా, హెల్దీగా చేసుకుంటే.. మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. బోర్ కొట్టకుండా ఉంటుంది. రాజ్మా ఆరోగ్యానికి చాలా మంది. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు ఉన్నాయి. రాజ్మా నేరుగా తినలేని వారు ఇలా పులావ్‌డగా చేసుకుని కూడా తినవచ్చు. మరి ఈ రాజ్మాతో పులావ్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఉడికించిన రాజ్మా, బాస్మతీ రైస్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, పుదీనా, కొత్తిమీర, పులావ్ దినుసులు, ఉప్పు, కారం, పసుపు, శీరా కల్లు.
ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే రాజ్మా కూడా నానబెట్టి 80 శాతం ఉడికించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత బాస్మతీ రైస్ శుభ్రంగా కడిగి ఓ అరగంట పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఓ కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ కొద్దిగా, నెయ్యి కొద్దిగా వేసి వేడి చేయాలి. ఆ తర్వాత పులావ్ దినుసులు వేసి వేయించాక.. ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు వేయాలి. ఇవి కూడా వేగాక పుదీనా కొత్తిమీర, శీరాకల్లు, కారం, పసుపు, ఉప్పు వేసి వేయించాలి.
ఆ తర్వాత రాజ్మా, బాస్మతీ రైస్, రైస్ ఉడకడానికి తగినంత నీరు వేసి మూత పెట్టాలి. రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. వేడి తగ్గాక మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రాజ్మా పులావ్ సిద్ధం. దీన్ని ఏ కర్రీతో తిన్నా.. రైతాతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. టేస్టీగా, హెల్దీగా ఉండాలి అనుకునేవారికి ఇది బెస్ట్ రెసిపీ. దీన్ని బ్రేక్ ఫాస్ట్‌గా, లంచ్‌గా, డిన్నర్‌గా కూడా తినవచ్చు. వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.