Poha Payasam: టేస్టీ అండ్ హెల్దీ అటుకుల పెసరపప్పు పాయసం.. రుచి అదుర్స్..

| Edited By: Ravi Kiran

Oct 26, 2024 | 9:31 PM

పాయసం అనగానే చాలా మందికి గుర్తొచ్చేది సగ్గుబియ్యం లేదా సేమియా పాయసం. ఎలాంటి పండుగలైనా.. ఫంక్షన్స్ అయినా.. ఎక్కువగా ఇంట్లో సేమియా చేస్తూ ఉంటారు. సేమియా పాయసం తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఎప్పుడూ రెగ్యులర్‌గా కాకుండా ఈ సారి ఈ అటుకుల పెసరపప్పు పాయసాన్ని ట్రై చేయండి. రుచి చూసిన వాళ్లు ఆహా అనాల్సిందే. అందులోనూ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శరీరానికి చలువ చేస్తుంది. తక్షణమే శక్తిని కూడా ఇస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎప్పుడూ ఒకేలాంటి పాయసం..

Poha Payasam: టేస్టీ అండ్ హెల్దీ అటుకుల పెసరపప్పు పాయసం.. రుచి అదుర్స్..
Poha Pesarapappu Payasam
Follow us on

పాయసం అనగానే చాలా మందికి గుర్తొచ్చేది సగ్గుబియ్యం లేదా సేమియా పాయసం. ఎలాంటి పండుగలైనా.. ఫంక్షన్స్ అయినా.. ఎక్కువగా ఇంట్లో సేమియా చేస్తూ ఉంటారు. సేమియా పాయసం తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఎప్పుడూ రెగ్యులర్‌గా కాకుండా ఈ సారి ఈ అటుకుల పెసరపప్పు పాయసాన్ని ట్రై చేయండి. రుచి చూసిన వాళ్లు ఆహా అనాల్సిందే. అందులోనూ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శరీరానికి చలువ చేస్తుంది. తక్షణమే శక్తిని కూడా ఇస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎప్పుడూ ఒకేలాంటి పాయసం కాకుండా వెరైటీగా ఉంటుంది. ఈ పాయసం చేయడం కూడా సులభమే. చాలా ఈజీగా తక్కువ సమయంలోనే చేయవచ్చు. మరి ఈ అటుకుల పెసర పప్పు పాయసానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

అటుకుల పెసర పప్పు పాయసానికి కావాల్సిన పదార్థాలు:

అటుకులు, పెసర పప్పు, పాలు, బెల్లం పొడి, నెయ్యి, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్.

అటుకుల పెసర పప్పు పాయసం తయారీ విధానం:

ముందుగా పెసర పప్పు, అటుకులను విడివిడిగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అటుకుల్లో కొద్దిగా నీరు వేసి కనీసం పావుగంట సేపు నానబెట్టాలి. ఆ తర్వాత ఒక పాత్రలో పెసరపప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో పాత్రలో పాలు పోసి మరిగించాలి. ఇలా మరుగుతున్న పాలలో అటుకుటు, ఉడికించిన పెసర పపప్పు, బెల్లం పొడి, యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి చిన్న మంట మీద ఓ పది నిమిషాలు అన్నీ కలిసేలా ఉడికించాలి.

ఇవి కూడా చదవండి

మధ్య మధ్యలో అడుగంట కుండా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేయడమే. ఇప్పుడు ఇందులో నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ చల్లుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే అటుకుల బెల్లం పాయసం సిద్ధం. ఈ పాయసాన్ని ఫ్రిజ్‌లో పెట్టి.. రెండు రోజుల వరకు తినవచ్చు. ఇది చిన్న పిల్లలకు, పెద్ద వాళ్లకు కూడా చాలా మంచి చేస్తుంది.