Pesara Pappu Charu: వేడి అన్నంలోకి ఈ పెసర పప్పు చారు వేసుకుని తింటే.. ఆహా అంటారు!

| Edited By: Shaik Madar Saheb

Jul 09, 2024 | 9:55 PM

ఇప్పటికీ కొన్ని పల్లెటూర్లలో కొన్ని రకాల పురాతన వంటకాలు కనిపిస్తూ ఉంటాయి. వీటితో ఇలా కూడా చేస్తారా? అని తినే దాకా తెలీదు. ఇవి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. అలాంటి వాటిల్లో ఈ పెసర పప్పు చారు కూడా ఒకటి. ఇప్పటి వరకూ మీరు రసాల్లో చాలా రకాలు చూసే ఉంటారు. కానీ ఈ రసం మాత్రం వేరు. వేడి వేడి అన్నంలోకి వేసుకుని ఆవకాయ నంచుకుని తింటే ఆహా చెబుతుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి. నాన్ వెజ్ వంటకాలే కాదు..

Pesara Pappu Charu: వేడి అన్నంలోకి ఈ పెసర పప్పు చారు వేసుకుని తింటే.. ఆహా అంటారు!
Pesara Pappu Charu
Follow us on

ఇప్పటికీ కొన్ని పల్లెటూర్లలో కొన్ని రకాల పురాతన వంటకాలు కనిపిస్తూ ఉంటాయి. వీటితో ఇలా కూడా చేస్తారా? అని తినే దాకా తెలీదు. ఇవి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. అలాంటి వాటిల్లో ఈ పెసర పప్పు చారు కూడా ఒకటి. ఇప్పటి వరకూ మీరు రసాల్లో చాలా రకాలు చూసే ఉంటారు. కానీ ఈ రసం మాత్రం వేరు. వేడి వేడి అన్నంలోకి వేసుకుని ఆవకాయ నంచుకుని తింటే ఆహా చెబుతుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి. నాన్ వెజ్ వంటకాలే కాదు.. ఇలాంటి వంటకాలు తిన్నా కూడా అన్నం ఇంకా తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పే పెసర పప్పు చారు కూడా ఎంత తిన్నా తినాలి అనిపిస్తుంది. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. మరి ఈ పెసర పప్పు చారు ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

పెసర పప్పు చారు తయారీకి కావాల్సిన పదార్థాలు:

పెసర పప్పు, తాళింపు దినుసులు, కరివేపాకు, కొత్తి మీర, పచ్చి మిర్చి, చింత పండు, ఆయిల్, టమాటాలు, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి.

పెసర పప్పు చారు తయారీ విధానం:

ముందుగా పెసర పప్పును శుభ్రంగా కడిగి నానబెట్టి.. ఉడక పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉడికి పోయిన పెసర పప్పును ఒక్కసారి రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొత్తి మీర, పచ్చి మిర్చి, చింత పండు రసం, టమాటాలు, ఉప్పు, పసుపు వేసి అన్నీ కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి. దీన్ని మీడియం మంట మీద ఓ 20 నిమిషాలైనా మరగ పెట్టుకోవాలి. ఇలా మరిగిన చారును పక్కన పెట్టి.. ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొటి వేయాలి. ఇవి వేగా తాళింపు దినుసులు, ఆ తర్వాత కరివేపాకు, ఎండు మిర్చి వేసి బాగా వేయించాలి. ఇవి వేగాక చారులో వేసి తాళింపు పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పెసర పప్పు చారు సిద్ధం. ఈ చారుతో ఆరోగ్యం కూడా పెరుగుతుంది.